31.7 C
Hyderabad
April 24, 2024 23: 26 PM
Slider సినిమా

సీతాయణం విడుద‌ల

seethayanam

అక్షిత్ శశికుమార్ ‘’సీతాయణం‘’ సెకండ్ సింగిల్ ‘’నేషనల్ క్రష్‘’ రష్మిక మందన్న విడుదల చేశారు. ‘’మనసు పలికే‘’ అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్ రాయగా శ్వేతా మోహన్ ఆలపించింది .

తెలుగు, కన్నడ, తమిళ భాషలలో కలర్ క్లౌడ్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రోహన్ భరద్వాజ్ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి నిర్మించిన చిత్రం ‘’సీతాయణం‘’. కన్నడ సుప్రీమ్ హీరో శశి కుమార్ తనయుడు అక్షిత్ శశి కుమార్ ని హీరోగా పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్, ఆంథమ్ ఇటీవల ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.

ఈ సంద‌ర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ “మెలోడీ ప్రధానమైన ఈ గీతం మూడు భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తుంది. అబ్బాయి వెనుక అమ్మాయి వెంటపడే ఈ గీతం డిఫరెంట్ గా ఉంది. ఖచ్చితంగా ట్రెండింగ్ అవుతుంది. టీజర్, సాంగ్స్ అన్నీసమ్ థింగ్ డిఫరెంట్ గా ఇంట్రస్ట్ ని క్రియేట్ చేస్తున్నాయి. చిత్రం సూపర్ సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా” అన్నారు.

కథానాయకుడు అక్షిత్ శశికుమార్ మాట్లాడుతూ “మూడు భాషలలో నాకు ‘’సీతాయణం ‘’ పెద్ద బ్రేక్ ను ఇస్తుంది. ఈ సినిమా చూసిన ఆడియన్స్ కి కూడా మంచి చిత్రం చూసామన్నఅనుభూతిని మిగులుస్తుంది. ‘రెస్పెక్ట్ ఉమెన్’ అన్న సీతాయణం టాగ్ 100% సినిమాకి జస్టిఫికేషన్ ఇస్తుంది” అన్నారు.

దర్శకనిర్మాతలు ప్రభాకర్ ఆరిపాక, లలిత రాజ్యలక్ష్మి మాట్లాడుతూ “రష్మిక మందన్న చేతులమీదుగా విడుదలైన ఈ పాట ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తుంది. ఇంత వరకూ మేల్ సింగర్స్ మాత్రమే పాడిన బ్రీత్ లెస్ చరణాలను ఇందులో శ్వేతా మోహన్ తొలిసారిగా ఆలపించింది. చంద్రబోస్ అద్భుతమైన సాహిత్యాన్ని ఈ పాటకు సమకూర్చారు. అతి త్వరలో చిత్ర ట్రైలర్ ను కూడా ప్రముఖుల చేతులమీదుగా విడుదల చేయిస్తాం. నిర్మాణాంతర పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి, అతి త్వరలో చిత్రాన్ని 3 భాషలలో ఏకకాలంలో విడుదల చేస్తాం” అన్నారు.

అక్షిత్ శశికుమార్ సరసన అనహితభూషణ్ కధనాయక నటించిన ఈ చిత్రం లో విక్రమ్ శర్మ, అజయ్ ఘోష్, విద్యులేఖ రామన్, మధునంధన్, బిత్తిరి సత్తి, హితేష్ శెట్టి, గుండు సుదర్శన్, కృష్ణ భగవాన్, జబర్దస్త్ అప్పారావు, అనంత్, బేబీ త్రియేక్ష, ఐ కె త్రినాథ్, మధుమణి, షర్మిత గౌడ, మేఘన గౌడ, తదితరులు ముఖ్య తారాగణం.

సినిమాటోగ్రఫి: దుర్గా ప్రసాద్ కొల్లి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
సాహిత్యం: చంద్రబోస్, అనంత్ శ్రీరామ్
ఫైట్స్: రియల్ సతీష్
కొరియోగ్రఫి: అనీష్
సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్
సమర్పణ: రోహన్ భరధ్వాజ్
నిర్మాత: లలిత రాజ్యలక్ష్మి
రచన& దర్శకత్వం: ప్రభాకర్ ఆరిపాక.

Related posts

కుక్కల దాడిలో అరుదైన చుక్కల జింక మృతి

Satyam NEWS

ఇప్పటికే ఉన్న నాయకులకు ఊడిగం చేయాల్సిందే

Satyam NEWS

దేశంలో ఏకైక నీతి వంత మైన నాయకుడు పవన్ కళ్యాణ్

Satyam NEWS

Leave a Comment