27.7 C
Hyderabad
April 18, 2024 09: 26 AM
Slider జాతీయం ప్రత్యేకం

పాకిస్తాన్ లో దుమారం రేపుతున్న మతమార్పిడి

Pakistan sikh

పాకిస్తాన్ లో బలవంతపు మత మార్పిడులు దుమారం రేపుతున్నాయి. సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ జిల్లాలో ఇద్దరు హిందూ ఆడపిల్లలను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ముస్లింలుగా మార్చిన సంఘటన మరువక ముందే పంజాబ్ ప్రావిన్స్ లో ఒక సిక్కు బాలికను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లి ముస్లింగా మార్చి ఒక ముస్లిం యువకుడికి ఇచ్చి పెళ్లి చేసిన విషయం అక్కడ జాతీయ స్థాయిలో దుమారం రేపుతున్నది. పంజాబ్ ప్రావిన్స్ లోని గురుద్వారాలో మతాచార్యుడిగా పని చేస్తున్న ఒక వ్యక్తికి చెందిన కుమార్తెను కొందరు బలవంతంగా ఇంట్లో నుంచి తీసుకువెళ్లి ముస్లిం మతంలోకి మార్పించి ముస్లిం యువకుడితో పెళ్లి జరిపించారు. అదే మని అడుగుతుంటే తమ కుటుంబం మొత్తం ముస్లింలుగా మారాల్సి ఉంటుందని, లేకపోతే దేశం విడిచిపెట్టి వెళ్లాల్సి వస్తుందని తమను బెదిరిస్తున్నారని ఆ కుటుంబం ఆరోపిస్తున్నది. తమను ప్రభుత్వం ఆదుకోకపోతే తమ కుటుంబం మొత్తం ఆత్మాహుతి చేసుకుంటుందని వారు ఆందోళన వ్యక్తంచేశారు. సిక్కు యువతి తల్లిదండ్రులు ఈ అంశాన్ని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దాంతో ఈ సంఘటనపై ఆయన విచారణకు ఆదేశించారు. పంజాబ్ ప్రావిన్స్ ప్రభుత్వం ఈ సంఘటనపై 30 మంది సిక్కు మత పెద్దలతో ఒక విచారణ కమిటీని నియమించింది. ఈ సంఘటన పై పోలీసుల కథనం మరో విధంగా ఉంది. 19 సంవత్సరాల ఆ సిక్కు యువతి ని అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ హసన్ అనే యువకుడు ప్రేమించాడట. ఒక రోజు ఆ సిక్కుయువతి అతడితో కలిసి వెళ్లిపోయిందట. ఆ అమ్మాయి తరపు న్యాయవాది జగజిత్ కౌర్ ఆమె చెప్పిన దాన్ని నమోదు చేసి న్యాయమూర్తికి ఇచ్చారని, అందులో కూడా ఆమె తన ఇష్టప్రకారమే మతం మారినట్లు ఉందని పోలీసు అధికారి మహ్మద్ జమీల్ తెలిపారు. ఆ యువతి తరపున లాహోర్ హైకోర్టులో వాదిస్తున్న షేస్ సుల్తాన్ అనే అడ్వకేట్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. తాను ఇష్టపూర్వకంగానే హసన్ ను పెళ్లి చేసుకున్నానని ఇందులో ఎలాంటి బలవంతం లేదని ఆ అమ్మాయితో చెప్పించారు. ఆ అమ్మాయితో ఒక వీడియో విడుదల చేశారు. దీన్ని పోలీసులు పరిగణన లోనికి తీసుకుని ఎవరిని అరెస్టు చేయలేదు. దాంతో స్థానికంగా నిరసన వ్యక్తం కావడంతో ఈ కేసుకు సంబంధించి హసన్ అతడి స్నేహితుడు, మరో నలుగురిని పంజాబ్ పోలీసులు అరెస్టు చేశారు. మహ్మద్ హసన్ అతడి స్నేహితుడు అర్సలామ్ మరో నలుగురు యువకులు ఈ కేసులో నిందితులు. వీరంతా కలిసి ఆ అమ్మాయిని ముస్లింగా మార్చారు. తర్వాత హసన్ తో నిఖా జరిపించారు. ఈ సంఘటనలపై భారత ప్రభుత్వం కూడా తన తీవ్ర నిరసనను పాకిస్తాన్ కు వ్యక్తం చేసింది. పోలీసుల కథనానికి భిన్నంగా యువతి తరపు బంధువులు చెబుతుండటంతో లాహోర్ హైకోర్టు ఆ యువతిని లాహోర్ లోని దారుల్ అమన్ రెస్క్యూ హోం కు పంపింది. (ఫొటోలో ఉన్నది సిక్కు యువతి తండ్రి, ఇద్దరు సోదరులు)

Related posts

టియుడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సైదిరెడ్డి కి ఆత్మీయ సన్మానం

Satyam NEWS

రఘురామ లేఖ: థర్మోకోల్ ఇళ్లతో ఎవరికి ప్రయోజనం?

Satyam NEWS

నాగర్ కర్నూల్ జిల్లాలో నేటి రాత్రి నుండి కర్ఫ్యూ అమలు

Satyam NEWS

Leave a Comment