పేదల శ్రేయస్సు కోసం బిఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఏదో ఒక సంక్షేమ పథకం ప్రతి గడపకు నేరుగా అందుతుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.ఖమ్మం నగరంలో కళ్యాణలక్ష్మీ, షాది ముభారక్ పథకం ద్వారా మంజూరైన 105 మందికి మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయా చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడిబిడ్డల పెళ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిళ్ల భారం తగ్గిందన్నారు. ఈ పథకం ప్రారంభించిన తొలినాళ్లలో రూ.50 వేలు ఇవ్వగా తరువాత రూ.75వేలు ఇవ్వడం జరిగిందన్నారు.
అనంతరం రెండవ సారి అధికారం లోకి వచ్చాక ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించిన సమయంలో కళ్యాణ లక్ష్మీ పై కేసీఅర్ సూచనలు చేయాలని కోరగా రూ.లక్ష కి పెంచలని తాను సూచించగా పలువురు ఎమ్మెల్యేలు సైతం ఇదే సూచనలు చేయగా ముఖ్యమంత్రి కేసీఅర్ సానుకూలంగా స్పందించి తక్షణమే అమలు చేయడం జరిగిందన్నారు.
ఖమ్మం కార్పొరేషన్-59, రఘునాధపాలెం -46 మొత్తం 105 చెక్కులకు గానూ రూ .1.05 కోట్లు పంపిణి చేయగా.. నేటి వరకు ఖమ్మం నియోజకవర్గంలో 8631 చెక్కులను గాను రూ.81.36 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేయడం సంతోషంగా ఉందన్నారు.
కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, కమర్తపు మురళి, సుడా చైర్మన్ విజయ్ కుమార్, తహసిల్దార్ స్వామి, కార్పొరేటర్లు గజ్జెల లక్ష్మీ, దొన్వాన్ సరస్వతి, పాకాలపాటి విజయ, బూర్రి వినయ్ కుమార్, దాదే అమృతమ్మ, ప్రశాంతి లక్ష్మీ, సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు మాదంశెట్టి హరి ప్రసాద్, టౌన్ అద్యక్షుడు పగడాల నాగరాజు, సిటీ లైబ్రరీ చైర్మన్ ఆశ్రీఫ్, రుద్రగాని ఉపేందర్, యర్రా అప్పారావు, ఆళ్ళ అంజిరెడ్డి, మాటేటి నాగేశ్వర రావు, బోజెడ్ల్ రాం మోహన్, షకీన తదితరులు ఉన్నారు.