35.2 C
Hyderabad
May 29, 2023 21: 32 PM
Slider హైదరాబాద్

పరిపాలనా సౌలభ్యం కోసం పునర్వ్యవస్థీకరణ

#Errabelli Dayakar Rao

పంచాయితీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించినందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని కలిసి ఆ విభాగం ఇంజనీరింగ్ అధికారులు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన కారణంగా కొందరికి ప్రమోషన్లు రావడమే కాక, పరిపాలన సౌలభ్యం కలిగిందని వారు మంత్రికి చెప్పారు. ఈ సందర్భంగా వారు మంత్రిని సన్మానించి తమ కృతజ్ఞతను చాటుకున్నారు.

ఇదే సమయంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వారితో మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగాన్ని పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో అధికారులు మరింత బాధ్యతతో పనిచేసి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమర్థవంతమైన సేవలు అందిస్తూ, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని సూచించారు.

మంత్రి ఎర్రబెల్లి ని కలిసిన వారిలో పలువురు పి అర్ ఎస్ ఇ లు, ఈ ఈ లు, డి ఈ ఈ లు, ఏ ఇ లు ఉన్నారు.

Related posts

24న కేటీఆర్ పర్యటనకు పకడ్బందీగా బందోబస్తు

Satyam NEWS

వరద బాధిత ఆదివాసీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అందరూ హాజరుకండి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!