గర్భిణీలను సురక్షితంగా ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం తర్వాత అంతే క్షేమంగా ఇంటివద్ద వదిలిపెట్టేందుకు ప్రభుత్వం 102 వాహనాలను అందుబాటులోకి తెచ్చింది. ఈ వాహనాలలో తరలింపుకు ఎలాంటి చార్జీలు లేకుండా ఉచిత సేవలు అందిస్తున్నాయి. అలాంటి 102 వాహనం మొరాయించడంతో మరొక 102 వాహన సహాయంతో టోచన్ ఏర్పాటు చేసి మొరాయించిన వాహనాన్ని తరలిస్తున్న దృశ్యం రామ మండల కేంద్రంలో సత్యం న్యూస్ కంట పడింది. గర్భిణులకు సేవలందించే వాహనం మొరాయించడంతో పాటు టోచన్ సహాయంతో వాహనాన్ని తరలించడాన్ని ప్రజలు ఆసక్తిగా తిలకించి ముక్కున వేలేసుకున్నారు. ఇలా వాహనం మొరాయించే వరకు చూడటం అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తోంది. వాహనాల సేఫ్టీని అధికారులు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారో ఈ ఉదంతం ద్వారా స్పష్టమవుతోంది. ఇకనైనా అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
previous post