28.2 C
Hyderabad
April 30, 2025 05: 55 AM
Slider జాతీయం

‘నోట్ల కట్టలు ఉన్నతి నిజమే’ :రిపోర్టులో వెల్లడి

#yashvanthvarma

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ నివాసంలో జరిగిన అగ్నిప్రమాదం తర్వాత కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన సంఘటనపై కీలక అంశాలు ప్రాధమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. “నాలుగు నుండి ఐదు సగం కాలిన నోట్ల కట్టలు” అక్కడ ఉన్నట్లు సంఘటనపై దర్యాప్తు చేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నియమించిన ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ ప్రాధమికంగా ఒక నిర్ధారణకు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో అంతర్గత విచారణ ప్రక్రియ కీలకమైన రెండవ దశకు చేరుకుంది. తుది దర్యాప్తు ఫలితాలు ఆ న్యాయమూర్తి భవిష్యత్తును నిర్ణయిస్తాయి.

మార్చి 14న ఢిల్లీలోని లూటియన్స్ ప్రాంతంలోని జస్టిస్ వర్మ అధికారిక నివాసంలోని స్టోర్‌రూమ్‌లో అగ్నిప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి ఫిర్యాదు చేశారు. వారు మంటలు ఆర్పుతున్న సమయంలో ఈ నోట్ల కట్టలు కనిపించాయి. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ మార్చి 21న తన నివేదికలో “లోతైన దర్యాప్తు” కోసం సిఫార్సు చేశారు. ఆ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సభ్యుల ప్యానెల్‌ను విచారణకు ఏర్పాటు చేశారు.

ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల విచారణ కమిటీలో జస్టిస్‌లు షీల్ నాగు (పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి), GS సంధవాలియా (హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి) మరియు కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి అను శివరామన్ ఉన్నారు. దర్యాప్తును ముగించడానికి విచారణ కమిటీకి ఎటువంటి కాలపరిమితిని నిర్ణయించలేదు. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయబడిన జస్టిస్ ఉపాధ్యాయ 25 పేజీల విచారణ నివేదికలో హిందీలో రెండు విషయాలు వెలుగు చూశాయి.

అవి జస్టిస్ వర్మ నివాసంలోని స్టోర్‌ రూమ్‌లో మంటలు ఆర్పిన తర్వాత, కరెన్సీ నోట్లతో కూడిన నాలుగు నుండి ఐదు సగం కాలిపోయిన కట్టలు దొరికాయని పేర్కొన్నాయి. ప్రాథమికంగా, షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగిందని నివేదిక పేర్కొంది. ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా, జస్టిస్ ఉపాధ్యాయతో కలిసి షేర్ చేసిన ఈ వీడియోలో కాలిపోయిన నగదు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జస్టిస్ వర్మ తన ప్రతిస్పందనగా, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాను లేదా తన కుటుంబ సభ్యులు ఎవరూ స్టోర్ రూమ్‌లో ఎప్పుడూ నగదు ఉంచలేదని అన్నారు.

Related posts

బాగున్నాడని చెప్పిన గంటలోనే చనిపోయాడన్నారు

Satyam NEWS

కాకాని రమణారెడ్డికి ఎంపీ ఆదాల శ్రద్ధాంజలి

mamatha

కేర్ టేకర్స్:కానిస్టేబుల్ కుటుంబానికి సిపి పరామర్శ

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!