33.2 C
Hyderabad
April 26, 2024 02: 01 AM
Slider ఆంధ్రప్రదేశ్

దేవాలయాల్లో ఇక నుంచి రిజర్వేషన్ పద్ధతి

212170-pulivendula

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ హిందు ధార్మిక సంస్థల నియామక చట్టం లో మార్పులు చేసింది. ప్రతి దేవాలయ ట్రస్టు ల్లో ఎక్స్ అఫిషియో సభ్యులను మినహాయించి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవాలయాల పాలకమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం నామినేటెడ్ సభ్యుల్లో 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం భర్తీ చేసే నామినేటెడ్ పదవులు (కార్పొరేషన్లు, వివిధ ట్రస్ట్ బోర్డులు, వ్యవసాయ మార్కెట్లు), కాంట్రాక్టుల్లో బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేబినెట్‌లో తీర్మానించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించింది.

Related posts

క్రిప్టోకరెన్సీతో మనీలాండరింగ్ ప్రమాదం తప్పదు

Satyam NEWS

ఏపీలో వృద్ధులకు అందించిన సాయం ఎంత?

Satyam NEWS

లాస్ట్ ఎంక్వయిరీ:రాధిక హత్య ఇంటి దొంగల పనేనా

Satyam NEWS

Leave a Comment