39.2 C
Hyderabad
March 29, 2024 15: 38 PM
Slider ముఖ్యంశాలు

ఓ విలేకరీ, వార్త రాసుకోక రాజకీయాలు నీకెందుకయ్యా?

#AndhrajyothyReporter

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రలోని బస్టాండ్ వద్ద వినాయక నగర్ కాలనీ వాసులు రాస్తారోకో నిర్వహించారు. తమ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునే దురుద్దేశంతో ప్రముఖ పేపర్లో పనిచేసే విలేకరి  (అంతా మా ఇష్టం) అనే శీర్షికతో వార్త రాసారని ఈ వార్త ద్వారా వినాయక్ నగర్ కాలనీ అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని కాలనీ వాసులు రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు.

సదరు పేపర్ ను కాలనీ వాసులు తగులబెట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ పేపర్లో ఆ విలేకరి ఉద్దేశ్యపూర్వకంగానే గ్రామంలోని వినాయక నగర్ కాలనిలో జరుగుతున్న అభివృద్ధి పనులను అడ్డుకునేందుకు తప్పుడు వార్తలు రాస్తున్నారని పేర్కొన్నారు.

వినాయక్ నగర్ కాలనిలో గత 30 సంవత్సరాల నుంచి 160 కుటుంబాల వరకు జీవిస్తున్నామని,ఇన్ని రోజులుగా జరగని అభివృద్ధి పనులు మా కాలనీ నందు ప్రస్తుతం జరుగుతుంటే కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టడానికి  ఉద్దేశ్య పూర్వకంగా కాలనిలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆ విలేకరి అడ్డుకుంటున్నాడాని ఆరోపించారు.

ఆ విలేకరి గ్రామంలో పాత కాలనీ కొత్త కాలనీల పేరుతో ప్రజలమధ్య  విభేదాలు సృష్టిస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించి స్థానిక నాయకులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

అనంతరం  పేపర్ ను తగలబెట్టి ,తరవాత పోలీస్ స్టేషన్లో తప్పుడు వార్తలు రాసిన సదరు విలేకరి పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు పత్తి సాయిలు,పంది ముక్కుల సతీష్,అబ్బయ్య,గంగాధర్,డాన్ రాజు,విరేశం, హన్మాండ్లు, శంకర్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆడ‌వాళ్ల‌కు అభ‌య హ‌స్తం…దిశ యాప్…..!

Satyam NEWS

మంత్రి కేటీఆర్ డూప్ పిఏలు ఇద్దరి అరెస్టు

Satyam NEWS

వరద సాయం చేయడంలో జగన్ ప్రభుత్వం పూర్తి విఫలం

Satyam NEWS

Leave a Comment