28.2 C
Hyderabad
April 20, 2024 11: 33 AM
Slider విజయనగరం

“సత్యం” న్యూస్ కు స్పందన: ట్రాఫిక్ పీసీ లకు సర్టిఫికెట్ ఇచ్చిన పోలీసు బాస్

#trafficpolice

ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లలో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్న” సత్యం న్యూస్. నెట్”..నికచ్చైన ,నిఖార్సైన.. వార్తలను నిస్సంకోచంగా ఇచ్చి.. ఆన్ లైన్ న్యూస్ నెట్ వర్క్ లలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సంగతి విదితమే. రెండు రోజుల క్రితం ఏపీలో ని విజయనగరం జిల్లా కేంద్రంలో ఓ ఆర్టీసీ బస్సు.. బ్రేక్ ఫెయిల్ అవ్వడం…డ్రైవర్ అప్రమత్తమై..వ్యవహరించినప్పటికీ..నగరంలో ఎత్తు బ్రిడ్జి నుంచీ కాంప్లెక్స్ వచ్చే రహాదారి వ్యతిరేక దిశలో దూసుకు రావడానికి మయూరీ జంక్షన్ వద్ద ఉన్న ట్రాఫిక్ పీస్ విజయ తన మేన్ ప్యాక్ ద్వారా కాంప్లెక్స్ వద్ద ఉన్న మరో పీసీ హరికృష్ణ ను అలెర్ట్ చేయడంతో పెను ప్రమాదాన్ని తప్పించారు.

అదే రోజు సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి ఫోటో లతో వార్తను సకాలంలో ఇవ్వడం…ప్రచురించడం జరిగింది. అయితే అప్పుడే సత్యం న్యూస్. నెట్ ప్రతినిధి… ఆ ట్రాఫిక్ పీసీలను ఎస్పీ అభినందిస్తారని చెప్పడం జరిగింది. అనుకున్న విధంగా నే సరాసరి పోలీసు బాస్ ఎస్పీ దీపికా …దండుమారమ్మ టెంపుల్ లో జరిగిన కార్యక్రమంలో సదరు ఇద్దరు ట్రాఫిక్ పీసీలను స్టేజ్ పై డీఎస్పీ లుండగానే విజయ్.,హరికృష్ణ లను సర్టిఫికెట్ తో అభినందించారు. కాగా పోలీసు అంటే… ర్యాష్ గా ఉంటూ కర్కశంగా ప్రవర్తించి..దురుసుగా.. వ్యవహరిహ్తూ…జాలి ,దయ ,కరుణ లేకుండా ఉంటారన్న ఆరోపణలకు ఈ ట్రాఫిక్ పీసీలు వ్యవహరించిన విధి ,పనితీరు తో ఏకంగా పోలీసు వ్యవస్థే సగర్వంగా తల ఎత్తుకుని ఉండే లా వ్యవహరించారంటోంది “సత్యం న్యూస్. నెట్”

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ట్రాజెడీ: అలగనూరు బ్రిడ్జిపై కారుబోల్తా పడి ఒకరి మృతి

Satyam NEWS

సహాయ నిధికి విరివిగా విరాళాలు ఇవ్వండి

Satyam NEWS

మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఆర్ పి లకు అలవెన్సులు వెంటనే ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment