36.2 C
Hyderabad
April 24, 2024 21: 30 PM
Slider విజయనగరం

విజయనగరం బాణా సంచా షాప్ లకు పోలీసుల వార్నింగ్..

#fireworks

ఈనెల 24న దీపావళి. ఆ రోజు ఇంటిల్లి పాది దీపాలంకరణలు…బాణాసంచా కాల్చుతూ లక్ష్మీ దేవికి పూజలు చేసిన ఆనందోత్సాహాలతో గడువు తారు.కానీ ఈ సారి దీపావళి కి..ఆ ఆనందం కాస్త మసకబారనుంది. అందుకు కారణాలపై అన్వేషణ చేస్తే ఆసక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి. నగరంలో కేఎల్.పురం వద్ద ఓ షాప్ లో పొగ రావడం ఒక్ఠటైతే..మరోక అంశం… ఆర్డీవో గా మహిళా అధికారి బాధ్యతలు తీసుకోవడం.

గడచిన రెండేళ్ల కరోనా తో దీపావళి పండగ అంతగా ఎవ్వరూ జరుపుకోలేదు. పర్యవసానంగా బాణసంచా కూడా పెద్దగా ఏ ఒక్కరూ కాల్చలేదు. తాజాగా కరోనా భయం పోవడం.. కొత్త ఆర్డీవో రావడం…బాణా సంచా షాప్ లు పెట్టుకునేందుకు ఆర్డీవో లకే అధికారాలు ఇవ్వడం…ఆ క్రమంలో కేఎల్ పురంలో చిన్న పాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో.. అధికారులు లైసెన్స్ షాపులతో పాటు హోల్ సేల్ షాప్ లకు వార్నింగ్ ఇచ్చారు.

ఇక పోలీసు, ఫైర్ ,రెవెన్యూ కమిటీ గా ఏర్పడి షాప్ లకు గుర్తింపు తో పాటు వాళ్ళు చెప్పిన విధంగా ఏర్పాటు చేయడంతో పాటు అమ్మకాలు చేయ్యాలి. తాజాగా  చిన్న పాటి ఫైర్ ఇన్సిడెంట్ జరగడంతో తాను ప్రత్యక్షంగ షాప్ లు చూసేంతవరకూ ఏ ఒక్క షాప్ తెరవకూడదని ఆర్డీవో ఆదేశాలు ఇవ్వడంతో.. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ క్షేత్ర స్థాయిలో ఉండటం విశేషం.

Related posts

అనారోగ్యంతో పెద్దమ్మ తల్లి గుడి పూజారి మృతి

Satyam NEWS

ఈ స్కూలు యాజమాన్యం నన్ను మానసికంగా వేధిస్తోంది..

Satyam NEWS

శనిగకుంట అగ్నిప్రమాద బాధితులకు తుడుందెబ్బ సాయం

Satyam NEWS

Leave a Comment