23.2 C
Hyderabad
September 27, 2023 20: 46 PM
Slider ముఖ్యంశాలు సంపాదకీయం

రిటైర్డ్ ఉద్యోగుల అవినీతి మాయాజాలం

HY26SECRETARIATCOMPLEX

అనుభవం ఉపయోగించి ప్రభుత్వానికి సాయపడండ్రా అంటే ఆ సంగతి పక్కన పెట్టి దోచుకుతింటున్నారు రిటైర్డ్ ఎంప్లాయీస్. రిటైర్ అయిన వాడు ఎలా దోచుకుంటాడా అని అనుకుంటున్నారా? రిటైర్ అయిన తర్వాత ప్రభుత్వంలో మళ్లీ చేరుతున్నాడు. ప్రభుత్వం కూడా గుడ్డిగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ను తిరిగి ఓఎస్ డి లుగానో, సలహాదారులుగానో తీసేసుకుంటున్నది. పదవి విరమణ చేసిన వారి అనుభవాన్ని మనం ఉపయోగించుకోకపోతే ఎలా అనే కారణం ప్రభుత్వం చూపిస్తున్నది.

ఓఎస్ డిలుగా లేదా ఇతర పోస్టుల్లో పని చేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు ఎడాపెడా దోచేసుకుంటున్నారు. ఇంటర్ మీడియట్ ఫలితాలలో అవకతవకలు జరిగిన దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్డ్ ఉద్యోగుల్ని పర్మినెంటుగా సాగనంపాలని నిర్ణయం తీసుకున్నారు కానీ ఎందుకో అది అమలు జరగలేదు. ఇంటర్ బోర్డు లో అవకతవకలు జరగడానికి ఒక రిటైర్డ్ ఎంప్లాయి కారణమనేది అందరికి తెలిసిన సత్యం. అదే విధంగా ఫైనాన్సు డిపార్టుమెంట్ లో, నీటిపారుదల శాఖ లో, సాధారణ పరిపాలన శాఖ లో రిటైర్డ్ ఉద్యోగుల ఇష్టారాజ్యం ఉంది.

అందినకాడికి అందినంత దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సాధారణ పరిపాలనా విభాగం సర్వీసెస్ డిపార్టుమెంట్ లో ఒక రిటైర్డ్ ఉద్యోగి రోజుకు లక్ష రూపాయలు సంపాదించే విషయాన్ని సత్యం న్యూస్ బయటపెట్టింది. ఇలాగే ఆర్ధిక శాఖలో జరుగుతున్నది. కార్మిక శాఖ లో పని చేస్తున్న ఈ రిటైర్డ్ ఎంప్లాయిస్ అవినీతి ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించినా  ఫైళ్లు తొక్కిపెడుతున్నారని కూడా సత్యం న్యూస్ పాఠకుల దృష్టికి తెచ్చింది.

తాజాగా నీటిపారుదల శాఖ లో ఒక బోగస్ జీవోను తీసుకొచ్చిన సంఘటన ఆశ్చర్యం కలిగించేదిగా ఉంది. ప్రపంచ బ్యాంకు ఆర్ధిక సాయంతో నాగార్జున సాగర్ ఆధునీకరణ పనుల్లో భాగంగా మిర్యాలగూడా డివిజన్ లోని ప్యాకేజీ డి సి 8 లో పనులు ఒక కాంట్రాక్టర్ చేపట్టి పూర్తి చేయలేకపోవడంతో ఇంకొకరికి అప్పగించారు. అతను కూడా పనులు పూర్తి చేయలేకపోవడంతో ప్రభుత్వం దాదాపుగా 89 లక్షల రూపాయల అపరాధ రుసుం విధించింది. పనులు జరగకపోవడానికి తన తప్పు లేదని ప్రకృతి సహకరించలేదని ఆ కాంట్రాక్టర్ ప్రభుత్వానికి విన్నవించాడు.

అపరాధ రుసుము రద్దు చేయాలన్న అతని వినతిపై ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ నెల 25న జీవో నెం. 2136 జారీ అయింది. దానిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంతకం కూడా ఉంది. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జీవోలపై సునీల్ కుమార్ జోషీ అని పూర్తి సంతకం పెడతారు. అయితే 2136 జీవో పై ఎస్ కె జోషి అని సంతకం పెట్టి ఉంది. సంబంధిత విభాగం సిబ్బంది ఒకరు అనుకోకుండా దీన్ని గుర్తుపట్టారు. ఇదే విషయాన్ని తన కొలీగ్స్ కు చెప్పారు. దాంతో ఆ జీవోపై అనుమానం వచ్చి ప్రధాన కార్యదర్శి కార్యాలయానికి వెరిఫికేషన్ కోసం పంపారు. ఇది తాము ఇచ్చిన జీవో కాదని వారు నిర్ధారించారు. ఈ మొత్తం తతంగం వెనుక రిటైర్డ్ అధికారి ఒకరు ఉన్నట్లుగా అనుమానం. అనుభవాన్ని మంచికి ఉపయోగించాలని కానీ ప్రభుత్వాన్ని బేవకూఫ్ ను చేసే ఈ పనులేంటి? ఇది అడిగే వాడు లేదు. ఎందుకంటే ఈ రిటైర్డ్ వారి వెనుక పెద్ద పెద్ద మంత్రులు, పార్టీ పెద్దలు ఉంటున్నారు

Related posts

రామా, యూపీలో why not 80?

Satyam NEWS

రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర

Satyam NEWS

ఇంకా కరోనా టీకా తీసుకోని వారిని గుర్తించేందుకు సర్వే

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!