33.2 C
Hyderabad
April 26, 2024 00: 20 AM
Slider సంపాదకీయం

రిటర్న్ గిఫ్ట్: రాజధాని మార్పు వ్యూహకర్త ఎవరు?

pjimage (8)

రాజధాని వ్యూహం మార్పు ముఖ్యమంత్రి జగన్ కు వచ్చిన ఆలోచనేనా లేక వెనుక ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు కచ్చితమైన సమాధానం అధికారికంగా దొరకదు కానీ జరిగిన పరిణామాలు చేస్తే మాత్రం వెనుక బలమైన శక్తి ఉన్నట్లు స్పష్టం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన నాటి నుంచి రాజకీయ పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్ధులలో ఒకరైన కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైపోయింది. రెండో ప్రధాన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ  తెలంగాణ రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత జరిగిన రెండో అసెంబ్లీ ఎన్నికలలో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. కేవలం 23 స్థానాలకే పరిమితం అయిన నాటి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయే వారి సంఖ్య ఎక్కువ అయింది. బిజెపిలోకి వైసిపిలోకి వెళ్లే వారి సంఖ్య పెరిగిపోవడంతో తెలుగుదేశం నాయకులు చేష్టలుడిగి చూడటం తప్ప మరేం చేయలేకపోతున్నారు.

వైసిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మరింత బలం పెంచుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నది. ఈ దశలో రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చింది. కొట్టక్కర్లేదు తిట్టక్కర్లేదు ఇంటో పొగ పెడితే వాడేపోతాడు అనే సామెత ప్రకారం వ్యవహరిస్తే చాలు మిగిలిన పని పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి జగన్ ఆలోచన చేసినట్లుగా అనిపిస్తున్నది. ఈ సామెతను గుర్తు చేసింది తెలంగాణ సిఎం కేసీఆర్ గా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనంగా ఉన్న తెలుగుదేశం పార్టీని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన అదనుగా ఇరువురు నేతలు ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.

ఈ వ్యూహం ప్రకారమే రాజధాని మారిస్తే అటు తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గం అయిన కమ్మ కులస్తుల ఆర్ధిక మూలాలు కదలిపోతాయని తద్వారా చంద్రబాబునాయుడు మరింత బలహీన పడతారని ఇద్దరు నేతలూ ఒక వ్యూహం రచించినట్లుగా తెలిసింది. దాంతో రాజధాని మార్పు అంశం తెరపైకి వచ్చిందని చెబుతున్నారు. రాజధాని మార్పు జరిగిపోతే ఇక తెలుగుదేశం పార్టీ గాలిలో దీపం మాదిరిగా తయారవుతుంది.

ఆ పార్టీ ఆర్ధిక మూలాలు పూర్తిగా కదలిపోతాయి. కకావికలమైపోతున్న ఆ పార్టీని ఇక దేవుడు కూడా కాపాడలేని స్థితికి వచ్చేస్తుందనేది ఇద్దరి నేతల వ్యూహంగా చెబుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ చెప్పిన రిటర్న్ గిఫ్టు ఇదేనని కూడా అంటున్నారు.  

Related posts

వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేస్తున్నారు

Satyam NEWS

శ్రీ రామకృష్ణ విద్యాలయం లో సైన్స్ ఎక్స్పొ

Murali Krishna

రంజాన్ తోఫా వితరణ ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి

Satyam NEWS

Leave a Comment