28.7 C
Hyderabad
April 25, 2024 03: 29 AM
Slider హైదరాబాద్

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ

#revanthreddy

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపిసిసి) అధ్యక్షుడు, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.

ఆదివారం కుషాయిగూడ లో బోనాల పండుగను పురస్కరించుకొని పోచమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రేవంత్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ లను ఘనంగా సన్మానించారు.

ఏఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ కరోనా విపత్కర సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో బోనాల పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, డిసిసి అధ్యక్షులు నందికంటి శ్రీధర్, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు తోటకూర జంగయ్య యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ యాదవ్,  ఏఎస్ రావునగర్ డివిజన్ అధ్యక్షుడు కొత్త అంజిరెడ్డి, సీనియర్ నాయకులు సీతారాం రెడ్డి, బొర్ర రాఘవరెడ్డి, మహమ్మద్ నజీర్, మెరుగు రామ్మోహన్, టిల్లు యాదవ్, పెద్ది శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి టిల్లు యాదవ్, యువజన కాంగ్రెస్  ప్రధాన కార్యదర్శి లింగస్వామి ఎన్ఎస్ యు ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాహుల్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు లలిత్ కుమార్, జిల్లా కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పత్తి కుమార్, నీరుకొండ సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వం చెయ్యలేదు… కానీ మేము చేస్తున్నాం: జనసేన పార్టీ నేత యశస్వి

Satyam NEWS

పంట పొలాల్లో మహిళ మృతదేహం

Bhavani

ఉరుసు ఉత్సవాలు పోస్టర్లను ఆవిష్కరించిన విశ్వేశ్వరరెడ్డి

Satyam NEWS

Leave a Comment