కొల్లాపూర్ పట్టణ కేంద్రం లోని వరిదేల సమీపంలో భూదాన్ స్థలంలో అక్రమ వెంచర్ వేయడానికి సిద్ధమైన కారకులపై రెవెన్యూ శాఖ పరంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోళ్ల శివ డిమాండ్ చేశారు. శుక్రవారం ఎమ్మార్పీఎస్ నాయకులు కోళ్ల శివ ఆధ్వర్యంలో ఆర్డీవోకు విన్నతి పత్రం అందచేశారు.
కొల్లాపూర్ పట్టణ ప్రాంతంలోని వరిదేల సర్వే నంబర్ 113లో 11.03 ఎకరాల భూదాన్ స్థలాన్ని వెంచర్ గా మార్చడానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు సిద్ధమయ్యారు. తాహసిల్దార్ కార్యాలయంలో కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారు. లోపాయకారిగా కొందరు అధికారులు అనుమతులు ఇస్తున్నారు.
తక్షణమే రెవెన్యూ శాఖ పరంగా ఈ అక్రమానికి పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. లేనియెడల ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని అగ్ర స్వామి, పుట్టపోగ రాము, పరమేశ్వర్, రామకృష్ణ, సన్నయ్య, మధు హెచ్చరించారు. దీనికి ముఖ్య కారకులు కారకులపై చర్యలు తీసుకొని భూదాన్ స్థలాని ఆధీనంలోకి తీసుకొని ముందు భౌవిష్యత్తులో ఏదైనా సోషల్ వెల్ఫేర్ లకు ఇవ్వడానికి ఉపోయోగపడుతుందని కోళ్ల శివ అంటున్నారు.