33.2 C
Hyderabad
April 26, 2024 01: 07 AM
Slider గుంటూరు

వచ్చే నెల 25 నాటికి కోటప్పకొండ తిరుణాళ్ల ఏర్పాట్లు పూర్తి

#kotappakonda

మహాశివరాత్రి సందర్భంగా గుంటూరు జిల్లా కోటప్పకొండలో జరగనున్న శ్రీ తికోటేశ్వర స్వామి వారి తిరుణాళ్లపై తొలి సమన్వయ సమావేశం కోటప్పకొండ స్వామి దేవస్థాన ప్రాంగణంలో జరిగింది. నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జేసీ దినేష్ కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

ముఖ్యంగా తిరుణాళ్ల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, కొవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా దర్శనం  చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

క్యూ లైన్లలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా గతేడాది ఉత్పన్నమైన సమస్యలు పునరావృతం కాకుండా చర్యలకు ఆదేశించారు. పండుగ రోజు శానిటేషన్ విషయంలో రాజీపడకుండా వీలైనంత ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసి చెత్తా చెదారం ఎక్కువ ఉండకుండా చూడాలన్నారు. నరసరావుపేట పట్టణంతో పాటు కొండ పైన, కింద పరిశుభ్రంగా  ఉండాలని ఆదేశించారు.

భక్తులకు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్ల సరఫరా ఎప్పటికప్పుడు జరిగేలా వీఆర్ఓలు, పంచాయతీ సెక్రటరీల సేవలు వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.

భద్రతా ఏర్పాట్లతో పాటు, ట్రాఫిక్, క్రౌడ్ మేనేజ్ మెంట్ పై సమావేశంలో చర్చించారు. 2 వేల మంది పోలీసులతో పాటు, ట్రాఫిక్ రూట్ మ్యాప్, పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు పై చర్చించారు. కొటప్పకొండకు తాకిడి ఎక్కువగా ఉండే చిలకలూరిపేట, వినుకొండ రోడ్డు, నరసరావుపేట నుంచి కోటప్పకొండ వెళ్లే మార్గాల్లో రోడ్డు పనులతో పాటు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఎప్పటికప్పుడు  దారి మళ్లించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

భక్తులు తప్పని సరిగా మాస్క్ లతో రావాలి

కోవిడ్ కేసులు ఎక్కువు అవుతున్న తరుణంలో భక్తులు మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మాస్క్ లేకుండా దర్శనానికి అనుమతించేది లేదన్నారు. అలాగే కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షణాలు ఉన్న వారి టెస్టులు చేయించుకునేలా చూడాలని, పాజిటివ్ వస్తే కొండ పైనే ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచాలే చూడాలని సమావేశంలో నిర్ణయించారు.

తిరుణాళ్ల నేపథ్యంలో నరసరావుపేట అర్బన్ తో పాటు కొండ వరకు లైటింగ్, మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, బహ్ర్మోత్సవాల సమయంలో తిరుపతి మాడ వీధుల్లా కొటప్పకొండ పరిసరప్రాంతాలు ఉండాలని సమావేశంలో నిర్ణయించారు.

గతంలో మాదిరిగానే ఈ సారి కూడా ఆర్టీసీ కీలక పాత్ర పోషించాలన్నారు. చిలకలూరిపేట,నరసరావుపేట, వినుకొండ డిపో బస్సులతో పాటు గుంటూరు నుంచి కూడా వీలైనన్ని సర్వీసులు నడపడంతో పాటు వాటి పార్కింగ్, ఎక్కడయినా బస్సులు బ్రెక్ డౌన్ అయితే వెంటనే స్పందిచే మెకానికల్ టీంను సిద్ధం చేయాలన్నారు.

దొంగల ఆటకట్టించడానికి వీలుగా నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా ప్రవేశపెట్టిన దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు, మహిళా పోలీసింగ్ సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించారు. నిర్ధేశించుకున్న పనులు త్వరతిగతిన పూర్తి కావడానికి కావాల్సిన నిధులు కలెక్టర్, జెడ్పీ సీఈవో మంజూరు చేయాలని కోరారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలున్న కోటప్పకొండ తిరుణాళ్ల మరికొద్ది రోజుల్లో రానున్న తరుణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని శాఖల సమన్వయంతో తిరుణాళ్ల పనులు త్వరతగతిన పూర్తి చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందన్నారు.

పది లక్షల మంది భక్తులు వస్తారని అంచనా

10 లక్షల మంది వచ్చే తిరుణాళ్లకు కావాల్సిన ఏర్పాట్లు, స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చే 2 లక్షల మందికి పైగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా ముందుకు వెళ్తామన్నారు. కోవిడ్ మహమ్మారి మరోసారి తన ప్రతాపం చూపిస్తూన్నా ప్రస్తుతం ఉన్న వేవ్ వల్ల ప్రాణనష్టం జరగదని,ఒకవేళ పాజిటివ్ వచ్చినా ఐదు, ఆరు రోజుల్లో తగ్గిపోతుందన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉంటూ మాస్కులు ధరించి స్వామి వారి దర్శనానికి రావాలని విజప్తి చేశారు. అన్ని శాఖల సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండా పాజిటివ్ వచ్చినా పనులు ఆగకుండా ప్రత్యామ్నయ మార్గాల ద్వారా ముందుకు వేయాలని కోరారు.

జేసీ దినేష్ కుమార్ మాట్లాడుతూ తిరుణాళ్లకు సంబంధించి తొలి సమన్వయ సమావేశానికి సంబంధించి నిర్ణయించుకున్న పనులను వచ్చే నెల 18 లోపు పూర్తి చేసేలా ముందుకు సాగుతామన్నారు. 18వ తారీఖును రెండో సమావేశం కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటు చేసి తిరుణాళ్ల ఏర్పాట్లు పూర్తిపై చర్చిస్తామన్నారు. ముడో సమావేశం 25 తారీఖున ఏర్పాటు చేసి పండుగకు ఐదు రోజుల మందు నుంచి భక్తుల తాకిడిని అంచనా వేసి సిబ్బంది అంతా తమ విధుల్లో చేరాలా చూస్తామని అన్నారు. ముఖ్యంగా ఆలయ అలంకరణ, భక్తుల రద్దీ, భద్రతా, ట్రాఫిక్ సమస్యపైనే ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తామన్నారు.

కార్యక్రమంలో ఆలయ ఈవో  రామ కోటిరెడ్డి, ధర్మకర్త కొండల్ రావు,  జెడ్పీటీసీ చిట్టిబాబు, ఎంపీపీ మూరబోయిన శ్రీనివాసరావు, కొండకావూరు సర్పంచ్ నాగిరెడ్డి,  జెడ్పీ సీఈవో  గజ్జల శ్రీనివాసరెడ్డి, ఆర్డీవో శేషారెడ్డి, ఎమ్మార్వో రమణా నాయక్, ఆర్డీవో పరంధామ రెడ్డి, డీఎంహెచ్ ఓ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

వి.శరత్, సీనియర్ జర్నలిస్టు, సత్యంన్యూస్.నెట్

Related posts

అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేసిన భర్త

Satyam NEWS

శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం ధ్వజస్థంభం ప్రతిష్ట

Bhavani

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

Leave a Comment