విజయనగరం జిల్లా వ్యాప్తంగా 66 అట్రాసిటీ కేసుల్లో 9 కేసులు ట్రైయిల్ కోర్ట్ లలో ఉన్నాయని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. కలెక్టరేట్ లో జిల్లా స్థాయి ఎస్పీ,ఎస్టీ స్థాయి విజిలెన్స్, మోనటరింగ్ కమిటీ సమావేవంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని మాట్లాడారు. గతేడాది అక్టోబరు 10 నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు జిల్లాలో మొత్తం 66 ఎస్‌సి ఎస్‌టి అట్రాసిటీ కేసులు నమోదయ్యాయన్నారు. వీటిలో 41 కేసుల్లో దర్యాప్తు కొనసాగుతోందని, 9 కేసులు ట్రయిల్ కోర్డులో పెండింగ్‌లో ఉన్నాయని, 16 కేసులను రిఫర్ చేయడం జరిందని వివరించారు.
చట్టప్రకారం బాధితులకు న్యాయం చేసేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నామని చెప్పారు. ఈ సమావేశంలో విజయనగరం, చీపురుపల్లి, బొబ్బిలి డీఎస్పీలు గోవిందరావు,చక్రవర్తి లతో పాటు పోలీస్ పీఆర్ఓ కోటేశ్వరరావులు ఉన్నారు. అట్రాసిటీ కేసుల్లో వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని ఎస్‌పి తెలిపారు ఈ.కార్యక్రమంలోడిఆర్ఓ ఎస్‌డి అనిత మాట్లాడుతూ, ఇప్పటివరకు నమోదైన అట్రాసిటీ కేసుల్లో బాధితులకు అందించిన పరిహారాన్ని, పెండింగ్ కేసుల సంఖ్యను వివరించారు.
సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, సోషల్ వెల్ఫేర్ డిడి బి.రామానందరం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ విజయలక్ష్మి, కమిటీ అధికార సభ్యులు జిల్లా బిసి సంక్షేమాధికారి సందీప్‌కుమార్, మెప్మా పిడి సుధాకరరావు, మత్స్యశాఖ డిడి నిర్మలకుమారి, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి సుధారాణి, అనధికార సభ్యులు బొంగ భానుమూర్తి, రేజేటి జయరావు, రెట్టంగి గోపాల, ఆర్‌డిఓలు, డిఎస్‌పిలు, పలువురు జిల్లా అధికారులు, సాంఘిక సంక్షేమశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
శాఖల అధికారుల హాజరు కాకపోవడంతో కలెక్టర్ సీరియస్…!
విజయనగరం జిల్లా స్థాయీ ఎస్సీ,ఎస్టీ మోనటింగ్ సమావేశానికి పలు శాఖల అధికారలు హాజరు కాకపోవడంపై జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. కమిటీలో పలు సంఘాల నేతలు,సభ్యలు ప్రశ్నించిన,అడిగిన ప్రశ్నలకు జిల్లా కలెక్టర్ సమాదానం చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే…సభ్యలు ముందే కమిటీ సమక్షంలో సంబంధిత అధికారులచే సమాధానం చె్పించాల్సిన బాద్యత కలెక్టర్ దే.ఈ క్రమంలోనే. కలెక్టరేట్ లో కలెక్టర్ అధ్యక్షతన తొలిసారిగా…ఎస్సీ,ఎస్టీ జిల్లా స్థాయీ మోనటరింగ్ జరిగిన ఈ సమావేశానికి ప్రధానంగా పోలీస్ శాఖ హాజరుకావల్సి ఉండగా…జిల్లా పోలీస్ బాస్ వకుల్ జిందాల్ హాజరయ్యారు.
అలాగే బాస్ ఆదేశాలతో విజయనగరం డీఎస్పీ గోవిందరావు, చీపురపల్లి డీఎస్పీ చక్రవర్తి,బొబ్బిలి డీఎస్పీ లు హాజరయ్యారు. ఇంత వరకు బానే ఉంది…రెవిన్యూ పరంగా…అలాగే పలు శాఖల పరంగా…ఏ ఒక్క జిల్లా అధికారి…కలెక్టరేట్ లోజరిగిన మోనిటరింగ్ కమిటీ సమావేశానికి హాజరుకాక పోవడం విశేషం.దీంతో మోనటింగ్ కమిటీ సమావేశానికి వచ్చిన సభ్యులు అడిగిన ,లేవనెత్తిన ప్రశ్నలకు కలెక్టర్ ఒక రకంగా సమాధానం ఇవ్వలేదు.దీంతో అక్కడే…కమిటీ సభ్యుల ముందే…డీఆర్ఓ తో పాటు సోషల్ వెల్ఫేర్ అధికారులకు గట్టి గా వార్నింగ్ ఇచ్చారు…జిల్లా కలెక్టర్ డా.బీ.ఆర్.అంబేద్కర్. తదుపరి సమావేశానికి అన్ని శాఖల అధికారులు తప్పని సరిగా విధిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.