28.7 C
Hyderabad
April 20, 2024 06: 45 AM
Slider ఆదిలాబాద్

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలి

#SCSTCases

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మానిటరింగ్ కమిటీ సభ్యులను అధికారులను ఆదేశించారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఏఎస్పి సుధీంద్ర లతో కలిసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం జిల్లాస్థాయి రివ్యూ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉన్నారని చట్టంపై ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించడానికి గ్రామపంచాయతీ స్థాయిలో సమావేశం నిర్వహించాలన్నారు. నిరక్షరాస్యులైన పేద ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇతరులతో బాధింపపడ్డప్పుడు ఇవ్వటం తప్పనిసరి వారికి అండగా ఉంటామని తెలిపారు.

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కారం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలకు ఆసరాగా కల్పిస్తున్నామని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలకు ఆయా శాఖల ద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని అన్నారు.

వీటి ద్వారా ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. కమిటీ సభ్యులు ఎస్సీ ఎస్టీలకు ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీ, సబ్సిడీల కు సంబంధించిన పథకాలను వివరించాలని సూచించారు. యువత చెడు దారిన నడవకుండా చూడాల్సిన బాధ్యత కమిటీపై ఉందని అన్నారు.

అనేకచోట్ల భూ సమస్యలు కూడా అట్రాసిటీ కిందికి తీసుకు వస్తున్నారని ఇటువంటి వాటిని సివిల్ కోర్టులో దావా వేయాలన్నారు. మండలంలోని సాలెగూడా గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరిస్తూ భూ కాస్తులో ఎక్కువ సంవత్సరాలు ఉన్నవారికి భూమి చెందుతుందని తెలిపారు.

ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ కొంతమంది వ్యక్తులు చట్టాన్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ అధికారులను కూడా బెదిరింప ప్రయత్నం చేస్తున్నారని చట్టం దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత మానిటరింగ్ కమిటీ సభ్యులపై ఉందన్నారు.

చట్టం కొన్ని సందర్భాల్లో తప్పుదారి పడుతుందని జిల్లాలో జరిగిన కొన్ని సంఘటనలు ఉదహరించారు. ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం చట్టం తీసుకరావడం జరిగిందని దానిని వారి సంరక్షణ కోసం వినియోగించాలన్నారు.

మానిటరింగ్ కమిటీ సభ్యులు కొలాంగొంది వాసుల సమస్య సమావేశంలో చర్చించినప్పుడు కలెక్టర్ ఎమ్మెల్యే స్పందిస్తూ 16 మందికి ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేశామని పని కూడా ప్రారంభమైందన్నారు.

అయితే తిరిగి వారు కాగజ్ నగర్ వెళ్తున్నారని కమిటీ సభ్యులు తెలిపినప్పుడు వారిని అక్కడ ఉంచేలా వారికి అవగాహన కల్పించాలన్నారు.

దీనికోసం గిరిజన సంక్షేమ శాఖ అధికారిని క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరితగతిన పరిస్థితిని వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. కొలాంగొంది వాసులకు అండగా ఉంటామని వారికి ఇచ్చిన భూములు ఎత్తువంపులు లేకుండా చదును చేసి ఇస్తామని ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో డిఆర్ఓ సురేష్ డి.ఎస్.పి అచ్చేశ్వరరావు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సజీవన్, దినదిన అభివృద్ధి అధికారిని మణెమ్మ, డి డబ్ల్యూ ఓ సావిత్రి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు రేగుంట కేశవ్, బానోత్ గోపాల్, గణేష్, వెంకటేష్, శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

హాపీ బర్త్ డే: నిప్పులాంటి మనిషి నందమూరి బాలకృష్ణ

Satyam NEWS

కాశ్మీర్ లో నిర్భంధాలపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు

Satyam NEWS

వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment