22.2 C
Hyderabad
December 10, 2024 11: 42 AM
Slider సినిమా

గ్రాఫిక్స్ మాయాజాలంతో అదరగొట్టిన ‘ఆదిపర్వం’

#adiparvam

మంచు లక్ష్మి, ఎస్తేర్ నోరాన్హా, శివ కంఠమనేని, ఆదిత్య ఓం మెయిన్ లీడ్స్ గా తెరకెక్కిన సినిమా ‘ఆదిపర్వం’. అన్వికా ఆర్ట్స్, ఏఐ(అమెరికా ఇండియా) ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీజిత ఘోష్, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

కథ విషయానికొస్తే రాయలసీమ లోని ఒక ఎర్రగుడి నేపథ్యంలో జరిగిన యదార్ధగాధగా చెబుతున్నారు. 1970-90 మధ్య కాలంలో జరిగిన ఈ వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఎర్రగుడిలో గుప్త నిధులు ఉన్నాయని వాటిని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. ఎమ్మెల్యే నాగమ్మ(మంచులక్ష్మి) క్షుద్ర శక్తులతో కలిసి ఆ గుప్త నిధుల కోసం ప్రయత్నిస్తుంటుంది. మరో వైపు ఆ ఊరి పెద్ద రాయప్ప కూడా గుప్త నిధి కోసం ప్రయత్నిస్తాడు. కాని ఆ గుడి క్షేత్ర పాలకుడు(శివ కంఠంనేని) ఆ గుడిని, నిధిని కాపాడుతూ ఉంటాడు.

ఈ క్రమంలో ఆ ఊళ్ళో ఉండే బుజ్జమ్మ, శ్రీను ప్రేమించుకుంటారు. శ్రీను వేరే కులం కావడంతో పెద్దల మధ్య తేడాలు వస్తాయి. బుజ్జమ్మ కుటుంబం ఏం చేసింది? గుప్తనిధి నిజంగానే ఉందా? దాని కోసం జరిగిన అరాచకాలు ఏంటి? ఎర్రగుడి ప్రాముఖ్యత ఏంటి? ప్రేమ కథకు, గుడికి సంబంధం ఏంటి? బుజ్జమ్మ, శ్రీను ప్రేమ ఫలించిందా? అమ్మవారు ఎందుకు రావాల్సి వస్తుంది? ఇలాంటి ఇంటరెస్టింగ్ విషయాలు తెలియాలంటే ఆదిపర్వం చిత్రం చూడాల్సిందే.

గతంలో అమ్మోరు, అరుంధతి లాంటి దేవతలు, మంత్రశక్తులు, అద్భుత శక్తులు ఉన్న వారి కథలతో కూడిన సినిమాలు చాలా వచ్చేవి. ఆ జానర్ లో వచ్చే కథలన్నీ కూడా హిట్టే. ఈ ఆదిపర్వం సినిమా కూడా అదే తరహాలోనిది. పిరియాడిక్ సినిమాలు తీయడం కష్టంతో కూడుకున్నపని. అయితే అలాంటి కష్టమైన సబ్జెక్ట్ ను తీసుకుని ఆదిపర్యం ఆద్యంతం ఆసక్తిగా మలచిన దర్శకుడు అభినందనీయుడు. దర్శకుడు రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడు కావడం వల్లనేమో రాయలసీమ సంస్కృతిని చక్కగా చూపించారు.

ఆలయాల ప్రాముఖ్యం, ఆధ్యాత్మికత గురించి బాగా చెప్పారు. అమ్మోరు లాంటి సినిమాలో లాగా దేవతలు వచ్చే గ్రాఫిక్స్, యాక్షన్ సీక్వెన్స్ చాన్నాళ్లకు ఈ సినిమాలో చూపించారు. గ్రాఫిక్స్ చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రేమ కథ మాత్రం కొంత సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. అయితే కథలో మలుపుల కారణంగా ప్రేమ కథ కూడా ఆసక్తిగానే సాగుతుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మంచు లక్ష్మి నెగిటివ్ రోల్ లో ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ లతో నాగమ్మ పాత్రలో అదరగొట్టింది.

ఆదిత్య ఓం హనుమంతు పాత్రలో చక్కగా చేశాడు. సినిమా చివరలో ఆదిత్య ఓం తీసుకునే నిర్ణయం ఎవరూ ఊహించరు. అంతటి ఉత్కంఠ రేకెత్తించే సీన్ అది. శ్రీజిత ఘోష్ తన అందాలతో అలరిస్తుంది. ఎస్తేర్ నోరాన్హా, సుహాసిని, శివ కంఠమనేని, వెంకట్ కిరణ్, సత్య ప్రకాష్, సమ్మెట గాంధీ, జెమినీ సురేష్, ఢిల్లీ రాజేశ్వరి మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో జీవించారు. సత్యప్రకాష్, జెమినీ సురేష్ లు ఉన్నప్పుడు వచ్చే కామెడీ సీన్లు రక్తి కట్టించాయి.

ఇక సాంకేతిక అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. గ్రాఫిక్స్ కొత్త అనుభూతిని మిగిలిస్తాయి. దేవతల ఎలివేషన్ సీన్స్, యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయాయి. సింపుల్ కథనంతో సంజీవ్ మేగోటి ఆదిపర్వం సినిమాను బాగానే తెరకెక్కించాడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు కనిపిస్తుంది.

Related posts

ముంపు బాధితులను అండగా ఉంటాం

Bhavani

ఆబ్సెంట్: నేడు సిబిఐ కోర్టుకు రాని జగన్

Satyam NEWS

JCHSL కు వెంటనే ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment