27.7 C
Hyderabad
April 26, 2024 05: 27 AM
Slider నల్గొండ

తాగు నీటి సమస్యలు తలెత్తకుండా చూడాలి

#Chirumarthy Lingaiah

వేసవి కాలంలో మంచి నీటి సమస్య రాకుండా చూడాలని నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం నార్కట్ పల్లి లోని ఎంపీడీవో కార్యాలయంలో మిషన్‌ భగీరథ పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

అసంపూర్తిగా మిగిలిపోయిన మిషన్‌ భగీరథ పనులను జూన్ మొదటి వారం లోపు పూర్తి చేసి తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేసి నల్లా కనెక్షన్‌లు ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరిస్తూ ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు

Related posts

అయ్యప్ప స్వాములకు అన్న సమారాధన సత్రం

Satyam NEWS

అంతర్జాతీయ కంపెనీల గమ్యస్థానం తెలంగాణ

Sub Editor 2

స్కూలు మానేసిన వారిని తిరిగి చేర్చాలి

Bhavani

Leave a Comment