24.2 C
Hyderabad
December 10, 2024 00: 53 AM
Slider ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకం

కేంద్రమా నీకెందుకు ఇంత ఉలికిపాటు?

elecrticity

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పీపీఏ ల సమీక్ష జరపాలనుకుంటున్నా, పెద్ద ప్రాజెక్టులకు రీ టెండరింగ్  విధానం అమలు చేయాలన్నా తెలుగుదేశం నాయకుల లాగా కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎందుకు విమర్శలు చేస్తున్నారో అంతుపట్టని అంశాలు గా మిగులుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణంలో అవకతవకలు జరిగాయా లేదో తెలుసుకోవడం తో పాటు తక్కువ ఖర్చుతో అయిపోవాల్సిన పనులలో కోట్లాది రూపాయలు ప్రజాధనం దుబారా అయితే దానిని అరికట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను కొత్త ప్రభుత్వం  అడ్డుకుంటూ ఉంటే ఎదో జరిగిపోయినట్లు ప్రచారం చేయడం ఎందుకో అంతుపట్టడం లేదు. విద్యుత్ ఒప్పందాలను పున సమీక్షిస్తామంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారో అర్ధం కావటంలేదు. తమ తప్పు లేదని నిజాయితీలో నాకు మించిన వారు లేరని ప్రచారం చేసుకునే ప్రతిపక్షనాయకుడు 1999 వ సంవత్సరం నుంచి 2004వ సంవత్సరం మధ్య కాలం లో జరిగిన గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రోజెక్టుల నిర్మాణం గురించి అవలోకనం చేసుకోవాలి.

ఆర్ధిక సంస్థలను కొల్లగొట్టిన పవర్ ప్రాజెక్టులు                           

కోట్లాది రూపాయల పెట్టుబడులతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టులు ప్రస్తుతం ఉత్పత్తి లేక మూతబడి ఆర్ధిక సంస్థలకు కోట్లాది రూపాయలు ఎలా ఎగ్గొట్టాయో  తెలుసుకుందాం. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ )ల పున సమీక్ష అంశం పై కేంద్రం ఎందుకు అడ్డుపుల్లలు వేస్తున్నదో అంతుపట్టడం లేదు. కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాజాగా రాసిన రెండో లేఖ లో పారదర్శక అవినీతి రహిత పాలనకు కేంద్రం సహకరిస్తుందని పేర్కొంటూనే సాంప్రదాయేతర, పవన విద్యుత్ రంగాలలో మనదేశం ప్రపంచదేశాలను ఆకర్షిస్తోందని కేంద్ర మంత్రి ఆ ర్ కె సింగ్ తాజాగా పేర్కొన్నారు. కొనుగోలు ఒప్పందాలను పునసమీక్షిస్తే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని కేంద్రమంత్రి అభిప్రాయాన్ని పరిశీలించే టప్పుడు 1997 వ సంవత్సరం నుంచి 2004 వ సంవత్సరం మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గాస్ ఆధారిత విద్యుత్ ప్రోజక్టులుకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులు, ముందు చూపు లేకుండా ఇష్టా రాజ్యంగా జరిగిన ఒప్పందాలు దానివలన కలిగిన నష్టాలు వంటి అంశాలపై అవలోకన చేసుకోవాలి.

సొంత ఆస్తులు పెంచుకున్న విద్యుత్ సంస్థ యజమానులు                     

ప్రొజెక్టు పేరుతొ ప్రభుత్వ గ్యారెంటీని అడ్డుపెట్టుకొని ఆర్ధిక సంస్థల నుంచి వేల కోట్ల రూపాయలను రుణాలుగా తెచ్చి చివరికి గ్యాస్ అందుబాటులో లేదనే సాకుతో ప్రాజక్టులను మూసివేసి రుణాల చెల్లింపులను ఎలా ఎగ్గొట్టాలని పక్క దారులను చూస్తున్న ఈ మోసకారి పారిశ్రామికవేత్తల ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయడానికి ఒప్పందాల సమీక్ష చేస్తే ఏంటి ఇబ్బందో అంతుపట్టడంలేదు. సమీక్ష చేస్తామంటే పెట్టుబడులు రావని దీనివల్ల దేశానికి ఎదో కీడు జరిగిపోతుందని గొగ్గోలు పెట్టడం, తమ అర్ధ బలం తో ఇటు ప్రభుత్వ పెద్దలను, ఉన్నది లేనట్లు, గతంలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చి తప్పుడు నిర్ణయాల వల్ల జరిగిన నష్టాన్ని ప్రజలు తెలియ చేయకుండా   మీడియా ను అడ్డం పెట్టుకొని అవినీతిని ప్రోత్సహిస్తున్న వారిని ఖఠినం గా శిక్షించినప్పుడే పారిశ్రామిక రంగం కొత్త రూపు సంతరించుకుంటుంది.

అడ్డు ఆపూ లేకుండా గ్యాస్ కేటాయింపులు                  

కృష్ణా గోదావరి బేసిన్లో గాస్ ఏంత అందుబాటులో ఉంటుంది,దానివల్ల గాస్ ఆధారం ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి చేయ గలుగుతాం దానికి తగట్టుగా కొత్తగా వచ్చే విద్యుత్ ప్రోజక్టులకు సరఫరా చేయగలమనే సమాచారం ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు. ఈ ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత ప్రైవేట్ విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటుంది.రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంను అడ్డంపెట్టుకొని గాస్ అధారిటీ అఫ్ ఇండియా తో ఈ కంపెనీలు రాని కంపెనీకేలకు గాస్ కేటాయింపులు తెచ్చుకున్నాయి.1997 వ సంవత్సరం నుంచి 2004 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో నాలుగు కంపెనీలు తాము ఆడిందే ఆటగా వ్యహారాలను నడిపించారు. ప్రాజక్టు నిర్మాణం ప్రారంభించాలంటే రాష్ట్ర విద్యుత్ నియంత్రణమండలి అనుమతి ఇవ్వాలి.

అభ్యంతరాలు వచ్చినా పర్మిషన్లు ఇచ్చేశారు           

వీటికి అనుమతులు ఇవ్వటానికి నియంత్రణ మండలి జరిపిన  ప్రజాఅభిప్రాయ సేకరణలో ఎన్నో అభ్యంతారులు వచ్చాయి.భవిష్యత్తులో గాస్ ఎంతమేరకు అందుబాటులో ఉంటుందో కనీసం ముందు చూపు లేకుండా అనుమతులు ఇస్తే మరో దభోల్ ప్రోజక్టులు అవుతాయని అప్పట్లో విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరించారు కూడా. రాష్ట్రంలో తెలుగుదేశంపార్టీ అధికారంలో ఉండటం కేంద్రంలో ఏర్పాటు అయిన ప్రభుత్వంకు మద్దతుగా ఆ పార్టీ ఉండటంతో కొంత మంది పెద్దల అండతో ఈ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి. వందల కోట్ల రూయాలు చేతులు మారాయనే ఆరోపణలు వచ్చినా  అనుమతులు యధేచ్ఛగా వచ్చాయి.వీటిలోని కోనసీమ ప్రోజక్టుకి అయితే విద్యుత్ నియంత్రణమండలి అనుమతికి ముందు మూడు సంవత్సరాలు అధికారికంగా గాస్ కేటాయింపులు రావటం, అప్పటి గెయిల్ చైర్మన్ పదవి విరమణ పొందిన తరువాత ఈ కంపెనీకి చైర్మన్ కావటం కూడా విమర్శలకు దారితీసింది .

స్థిర చార్జీల పేరుతో కోట్లు చేతులు మారాయి        

దానితో పాటు ఈ విద్యుత్ సంస్థలు ఉత్పత్తి చేసినా చేయక పోయిన స్తిరచార్జిల కింద కోట్లాది రూపాయలను చెల్లించటానికి అప్పటి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. అప్పటి శాసనసభలో  దివగంత ప్రతిపక్ష నేత  రాజశేఖర రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టడమే కాకుండా అధికారంలోనికి వచ్చిన తరువాత ఈ కంపెనీల యాజమాన్యాలను పిలిపించి స్థిర చార్జీలు చెల్లించకుండా ఉత్తర్వులను జారీ చేశారు. లేకపోతె కోట్లాది రూపాల ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరు ఆయేది. ఇందులో కొంతమంది  కాగితాలపై ప్రోజక్టులను చూపించి భూములను దోచుకోవటం, ఆర్థికసంస్థల వద్ద ప్రభుత్వ భూములను తనఖాపెట్టి ఆ రుణాలను ఎగ్గొట్టడం ఆనవాయితీగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ప్రజలనుంచి ప్రతిపక్షాలనుంచి ఎన్ని విమర్శలు వచ్చినా కాసుల కక్కుర్తి కోసం అడ్డమైన ఒప్పందాలు చేసుకొని ప్రజలకు ప్రభుత్వానికి నష్టం కలిగించే వారి పట్ల కొత్త ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర మనుగడే ప్రశ్నర్ధాకం  అవుతుందని విద్యుత్ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పిపిఏల సమీక్షకు ఎందుకు భయపడుతున్నారు   

సామాన్యుడికి లక్ష రూపాయలను రుణంగా ఇవ్వటానికి నానా ఇబ్బందులు పెట్టె ఆర్ధిక సంస్థలు మాత్రం పెద్దల ఒత్తిడికి లొంగి కోట్లాదిరూపాయలు రుణాలుగా ఇస్తున్నాయి.కొనుగోలు ఒప్పందాలను సమీక్షమిస్తే ఎదో కొంప ములిగిపోయినట్లు బాధ పడుతున్న వారు తప్పు చేయకపోతే ఎందుకు సమీక్షాలకు భయ పడిపోతున్నారో  ఆలోచించాలి.సౌర విద్యుత్,పవన్ విద్యుత్ ప్రోజక్టులు కూడా గాస్ ఆధారిత ప్రోజక్టులు లాగ మూట పడకుండా ఉండాలంటే సమీక్షలు చేసి తప్పులను సరిదిద్దాల్సిన అవసరం అందరి పైన ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  

ముట్నూరు రామకృష్ణ

Related posts

నిను వీడని నీడను లే: రఘురామ మరో అస్త్రం

Satyam NEWS

రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షునిగా చిట్టి వెంకటరావు

Satyam NEWS

ఇకపై నా జీవితం ఈ “డైరెక్షన్”లో మాత్రమే!!

Satyam NEWS

Leave a Comment