24.7 C
Hyderabad
March 29, 2024 06: 07 AM
Slider నల్గొండ

వర్టికల్స్ సమర్ధ అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి

#DIGRanganath

తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ ను అన్ని స్థాయిల పోలీస్ అధికారులు సమర్ధవంతంగా అమలయ్యే విధంగా చూడాలని డిఐజి ఏ.వి. రంగనాధ్ నల్లగొండ పోలీస్ అధికారులను ఆదేశించారు.

శుక్రవారం పోలీస్ ఆడిటోరియంలో  నిర్వహించిన ఫంక్షనల్ వర్టీకల్స్ సమావేశంలో ఆయన పోలీస్ స్టేషన్ల వారీగా ఉన్న ఫంక్షనల్ వర్టీకల్స్ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫంక్షనల్ వర్టీకల్స్ విషయంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. వర్టీకల్స్ కు సంబందించిన అన్ని అంశాలను ఆన్ లైన్ నమోదులో రిసెప్షన్, సిసిటిఎన్ఎస్ ఆపరేటర్ల పాత్ర చాలా కీలకమని చెప్పారు.

పిర్యాదుదారులకు సంబందించిన అన్ని రకాల డాక్యుమెంట్స్ ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా సమర్పించడం ద్వారా పోలీస్ అధికారుల పనితీరును రాష్ట్ర, జిల్లా స్థాయిలలో అంచనా వేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.

పోలీస్ శాఖలో అమలు చేస్తున్న 14 రకాల వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ద వహించి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదును త్వరితంగా పరిష్కరించాలన్నారు. డయల్ 100కు వచ్చే ప్రతి ఫోన్ కు విధిగా స్పందించడంతో పాటు సాధ్యమైనంత త్వరితంగా ఘటనా స్థలానికి చేరుకోవడం ద్వారా ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని మరింత పెంచేలా పని చేయాలని సూచించారు.

అదే సమయంలో కోర్టు కానిస్టేబుల్స్ పనితీరు మెరుగు పర్చుకుంటూ శిక్షల శాతం పెరిగేలా చేయాలని అప్పుడే పోలీస్ శాఖ గౌరవం మరింత పెరుగుతుందని చెప్పారు.

సమీక్షా సమావేశంలో ఎస్.హెచ్.ఓ.లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై డిఐజి రంగనాధ్ సమగ్రంగా సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు.

రోడ్ సేఫ్టీలో జిల్లా అగ్రస్థానం

రోడ్డు ప్రమాదాల నివారణ కోసం జిల్లాలో తీసుకుంటున్న చర్యలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులను భాగస్వామ్యం చేయడం లాంటి వాటి వల్ల రాష్ట్రంలో జిల్లా అగ్ర భాగంలో నిలిచిందని అదే సమయంలో మరింత జాగ్రత్తగా పని చేస్తూ రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు.

ముఖ్యంగా రాత్రి సమయాలలోనే కాక పగటిపూట డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడం, ఓవర్ లోడ్ తో వెళ్లే వాహనాలు, పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లే వాహనాలపై దృష్టి సారించడం, రోడ్ల వెంట ఉండే దాబాలు, హోటల్స్ లో మద్యం అమ్మకాలు, మద్యం సేవించడం లాంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు నివారించాలని సూచించారు.

నేర విచారణలో జిల్లా అగ్రస్థానం

నేర విచారణకు సంబంధించిన వర్టీకల్స్ లో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నదని చెప్పారు. అయితే పరిష్కారంలో నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడం ద్వారా జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. జిల్లాలో కేసుల విచారణకు సంబంధించి కనగల్, పెద్దవూర, మునుగోడు, విజయపురి పోలీస్ స్టేషన్లు అగ్రస్థానంలో ఉన్నాయని చెప్పారు. జిల్లాలోని మిగిలిన పోలీస్ స్టేషన్లు సైతం మొదటి స్థానంలో నిలిచే విధంగా పని చేయాలని డిఐజి రంగనాధ్ అధికారులకు సూచించారు.

పోలీస్ శాఖలో అమలు చేస్తున్న ఆన్ లైన్ విధానంలో సెలవులు, ఇతర అన్ని రకాల సేవలను ఏ రకంగా వినియోగించుకోవాలనే అంశంపై డిపిఓ సూపరింటెండెంట్ అతిఖుర్ రెహమాన్ పోలీస్ అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించారు.

సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీలు నర్మద, సతీష్ చోడగిరి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, ఆనంద్ రెడ్డి, వెంకటేశ్వర్ రావు, రమణా రెడ్డి, సిఐలు బాలగోపాల్, సత్యం, నాగేశ్వర్ రావు, గోపి, రవీందర్, గౌరు నాయుడు, ఆదిరెడ్డి, వీర రాఘవులు, నిగిడాల సురేష్, మహబూబ్ బాషా, శంకర్ రెడ్డి, నాగరాజు,

శ్రీనివాస్ రెడ్డి, పి.ఎన్.డి. ప్రసాద్, నాగరాజు, వెంకటేశ్వర్లు, దుబ్బ అనిల్, ఆర్.ఐ.లు నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, ఎస్.ఐ.లు రాజశేఖర్ రెడ్డి, నాగరాజు, యాదయ్య, సత్యనారాయణ, నర్సింహా, రామకృష్ణ, గోపాల్ రావుతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిసిటిఎన్ఎస్ ఆపరేటర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

నాగిరెడ్డి చెరువు నీటిని అక్రమంగా వాడుతున్న క్రషర్ యజమానులు

Satyam NEWS

చెరువు కుంటను పరిరక్షించండి: ముంపు బెడద తప్పించండి

Satyam NEWS

మేడారంలో సీతక్క ప్రత్యేక పూజలు

Satyam NEWS

Leave a Comment