38.2 C
Hyderabad
April 25, 2024 13: 24 PM
Slider ఖమ్మం

అక్రమ కేసులు భరించలేక పాలేరు ఎమ్మెల్యే పై తిరుగుబాటు

#TRS Paleru

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో టిఆర్ఎస్ నాయకుల పై స్థానిక టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పెడుతున్న నిర్బంధానికి వ్యతిరేకంగా శుక్రవారం పాలేరు నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని ఆయన నివాసంలో కలిసి నియోజకవర్గంలో  తెరాస పార్టీలో మొదటి నుండి ఉన్న  టిఆర్ఎస్ నాయకుల పై పెడుతున్న అక్రమ కేసులు పై  వివరించడం జరిగింది.

అదేవిధంగా దీనిపై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగిందని తుమ్మలకి తెలియ పరచడం జరిగింది దీనిపై మాజీ మంత్రి తుమ్మల  తెరాస పార్టీలో ఉండి తెరాస ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నందున ధర్నాలు రాస్తారోకోలు ఇప్పుడు సరైనవి కావని సూచించారు. సమస్య పరిష్కారానికి సంబంధిత అధికారులకు ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ ఖమ్మం,జిల్లా కలెక్టర్ లకు సమస్యల పరిష్కారానికై వినతి పత్రాలు అందచేయాలని సూచించడం జరిగింది

అయినా సమస్యలు పరిష్కారం కాకుంటే అందరం కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడదామని  పార్టీ అధిష్టానం దృష్టికి మరియు ప్రభుత్వం దృష్టికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేద్దామన్నారు.దీనితో సంతృప్తి చెందిన పాలేరు నియోజకవర్గానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు తాము చేపట్టదలచిన పోలీస్ స్టేషన్ ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకున్నారు సోమవారం నాడు కమిషనర్ ఆఫ్ పోలీస్(ఖమ్మం) మరియు ఉన్నతాధికారులను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా టిఆర్ఎస్ పార్టీ నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి మద్ది మల్లారెడ్డి జొన్నలగడ్డ రవికుమార్ శాఖమూరి రమేష్ ధరావత్ రామ్మూర్తి నాయక్ వెన్నపూసల సీతారాములు నెల్లూరి భద్రయ్య ఎంపీటీసీ మాదాసు ఉపేందర్ జంగం భాస్కర్ మద్దినేని మధు బండి జగదీశ్ గోవింద్ జానకి రామయ్య పంతులు నాయక్ చంద్రశేఖర్ గోపాల్ సైదులు కోర్లకుంటా నాగేశ్వరరావు లక్ష్మి నర్సయ్య ఇంటూరి పుల్లయ్య బారి వీరభద్రం తోట వీరభద్రం మంకెన  వెంకటేశ్వరరావు కడియాల శ్రీనివాస్ అర్వపల్లి జనార్దన్ పూలూరి రమేష్ సూర్యకుమార్ కొండా మహిపాల్ తదితరులు పాల్గొన్నారు

Related posts

ఐక్య కార్యాచరణతోనే నూర్ భాషా/దూదేకుల గుర్తింపు

Satyam NEWS

విప‌క్ష పార్టీల‌కు టీఆర్ఎస్‌ ధీటుగా స‌మాధానం

Sub Editor

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment