27.7 C
Hyderabad
April 19, 2024 23: 13 PM
Slider కడప

మహిళా పోలీసుల సేవలు అభినందనీయం

#kadapapolice

అత్యుత్తమ పనితీరు కనబరచిన మహిళా పోలీసులను ప్రత్యేకంగా అభినందించిన వై.ఎస్.ఆర్ జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ వారికి ప్రశంసా పత్రాలు అందచేశారు. బాల్య వివాహాలు అరికట్టడంలో, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో మహిళా పోలీసుల సేవలు అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.

శుక్రవారం కడప నగరంలోని ‘పెన్నార్’ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ఇటీవలి కాలంలో విధుల్లో అత్యుత్తమ పనితీరు కనబరచిన 30 మంది మహిళా పోలీసులను అభినందించి ప్రశంసా పత్రాలు అందచేశారు. ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలో విధులు నిర్వర్తించే మహిళా పోలీసులు స్కూల్ డ్రాప్ ఔట్స్ గుర్తించి తిరిగి స్కూళ్లలో చేర్పించేలా కృషి చేయడం, ఈవ్ టీజింగ్, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యక్రమాల గురించి క్షేత్ర స్థాయిలో ఆరా తీసి ఉన్నతాధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. ఇదే స్పూర్తితో మున్ముందు విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్.పి ఆకాంక్షించారు. కార్యక్రమంలో అదనపు ఎస్.పి (అడ్మిన్) తుషార్ డూడి, ప్రొద్దుటూరు ఏ.ఎస్పీ ప్రేర్ణాకుమార్, ‘దిశ’ డి.ఎస్.పి ఆర్.వాసుదేవన్, జిల్లాలోని  డి.ఎస్.పి లు, సి.ఐ లు పాల్గొన్నారు.

శంసా పత్రాలు అందుకున్న మహిళా పోలీసుల వివరాలు:

1. వై.ఝాన్సీ రాణి కడప వన్ టౌన్ పి.ఎస్

2. కె.సుజాత, బద్వేల్ రూరల్

3. రిహానా,  ప్రొద్దుటూరు టూ టౌన్ పి.ఎస్

4 . ఎస్.అయేషా తబస్సుమ్, వేంపల్లి పి.ఎస్

5. వనిపెంట వరలక్ష్మి, బద్వేల్ పి.ఎస్

6. పి.పుష్పకుమార్, పులివెందుల పి.ఎస్

7. హిమబిందు, వేంపల్లి పి.ఎస్

8. బి.సంధ్య, ప్రొద్దుటూరు టూ టౌన్ పి.ఎస్

9. ఆర్.రెడ్డెమ్మ, పెండ్లిమర్రి పి.ఎస్

10. టి.హరిత, ప్రొద్దుటూరు వన్ టౌన్ పి.ఎస్

11. జి.వినోలియా, జమ్మలమడుగు పి.ఎస్

12. పి.తులసి, దువ్వూరు పి.ఎస్

13 ఏ.శ్రీలక్ష్మి, బద్వేలు పి.ఎస్

14. చల్లా శ్రీవాణి, కడప వన్ టౌన్ పి.ఎస్

15. ఎం.విమల, సింహాద్రిపురం పి.ఎస్

16. కె.సృజని, కడప రూరల్ పి.ఎస్

17. మునగపాటి దీప్తి, కడప రూరల్ పి.ఎస్

18. సి.సౌభాగ్య లక్ష్మి, రాజుపాలెం పి.ఎస్

19. పి.నాగేంద్రమ్మ, వల్లూరు పి.ఎస్

20 .కుందూ గాయత్రీ, చక్రాయపేట పి.ఎస్

21. కుప్పల రాజేశ్వరి, బద్వేల్ పి.ఎస్

22 పుట్టా సుభద్ర, జమ్మలమడుగు పి.ఎస్

23. ఈ.ఖాసీం బీ, కలమల్ల పి.ఎస్

24. హైమావతి సురేష్, కలమల్ల పి.ఎస్

25. కె.నాగలక్ష్మి, జమ్మలమడుగు పి.ఎస్

26. ఎం.ప్రశాంతి, సింహాద్రిపురం పి.ఎస్

27. కె.సుజాత, కడప టూ టౌన్ పి.ఎస్

28. గోపాలదాసు ప్రశాంతి, మైలవరం పి.ఎస్

29. సాకే స్వాతి, జి.ఆర్ పల్లి పి.ఎస్

30. పి.సుధారాణి, సిద్దవటం పి.ఎస్

అత్యుత్తమ ప్రతిభ కనబరచిన ‘దిశ’ సిబ్బందికి జిల్లా ఎస్.పి ప్రశంసా పత్రాలు అందచేశారు. మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలన్నారు.

ప్రశంసా పత్రాలు అందుకున్న ‘దిశ’ సిబ్బంది వివరాలు:

1 . పెండ్లికట్ల సుధారాణి, డేటా ఎంట్రీ ఆపరేటర్.

2. చెంచుగార్ల రమాదేవి, కస్టమర్ సపోర్ట్ ఫర్ పెర్సొనెల్

3. అంబటి నాగజ్యోతి, కస్టమర్ సపోర్ట్ ఫర్ పెర్సొనెల్

Related posts

చిన్నారి చైత్ర హంతకుడికి వెంటనే ఉరిశిక్ష విధించాలి

Satyam NEWS

నకరికల్లు వద్ద భారీగా తెలంగాణ మద్యం స్వాధీనం

Satyam NEWS

సంక్రాంతి పండుగ

Satyam NEWS

Leave a Comment