28.7 C
Hyderabad
April 20, 2024 08: 26 AM
Slider హైదరాబాద్

బియ్యం పంపిణీ చేస్తున్న గాయత్రి ఛారిటబుల్ ట్రస్ట్

Maganti Gopinath 031

జూబ్లీహిల్స్ నియోజక వర్గంలో 12 వందల నిరుపేద కుటుంబాలకు గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ బియ్యాన్ని అందించారు. కరోనా వ్యాధి వ్యాప్తి కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో నియోజక వర్గంలో ప్రతి నిరుపేదలకు అండగా ఎమ్మెల్యే ఉచిత బియ్యం పంపిణీ చేస్తున్నారు.

ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తంలో నిరుపేదలకు బియ్యం పంపిణీ చేసిన గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశం,రాష్ట్రం ప్రజలు ఇబ్బందులలో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఇలాంటి ట్రస్ట్ లు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

పేద ప్రజలు ఎవ్వరు కూడా ఇబ్బందులకు గురికావద్దు మీకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కరోనా వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు మీరు ఇండ్లలో ఉండి ప్రభుత్వం కు సహకరించాలి అని ఆయన కోరారు. గాయత్రి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నియోజక వర్గంలోని యూసఫ్ గూడ, రహమత్ నగర్ ,ఎర్ర గడ్డ,బోరాబండా, శ్రీనగర్ కాలనీ, షేక్ పేట ప్రాంతాల ప్రజలకు బియ్యం పంపిణీ చేశారు.

దీనికోసం ముందుకు వచ్చిన దాతలు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ గాంధీ లింగం, భారత్ లింగం, మరవ్ లింగం, లోకేష్ లింగం వీరిని అందరిని ఎమ్మెల్యే మాగంటి గోపినాధ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో బోరబండలో డిప్యూటీ మేయర్ బాబఫసిద్దిన్, యూసుఫ్ గూడ లో డివిజన్ అధ్యక్షులు రాజకుమార్ పటేల్ పాల్గొన్నారు.

ఇంకా రహమత్ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నాగరాజ్, సీన్ రెడ్డి, శ్రీనగర్ కాలనీలో ప్రెసిడెంట్ ఖాన్.షేక్పేట్ డివిజన్ లో ప్రెసిడెంట్ మహేష్ వెంగల్ రావు నగర్ GTS కాలనీ లో దేదీప్యి తదితరులు పాల్గొన్నారు.

Related posts

పేదల పట్టాలపై వాలుతున్న భూ రాబందులు

Satyam NEWS

3వ తేదీ నిరసనలు జయప్రదం చేయాలని కరపత్రం

Satyam NEWS

ఎంపీ అభ్యర్థి గంటా న‌ర‌హ‌రితో రాజంపేట టీడీపీ లో జోష్

Satyam NEWS

Leave a Comment