35.2 C
Hyderabad
April 20, 2024 18: 31 PM
Slider మహబూబ్ నగర్

తరుగుతో రైతుల ఆదాయానికి గండికొడుతున్నా రైస్ మిల్లర్లు

#kollapur

చౌట బెట్ల రైతులతో కలిసి మార్కెట్ యార్డ్ చైర్మన్ నిలదీసిన వంగ రాజశేఖర్ గౌడ్

రైతులకు రైస్ మిల్లర్లు అన్యాయం చేస్తున్నారని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుందని టిఆర్ఎస్ పార్టీకి చెందిన కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ జి. నరేందర్ రెడ్డి చెప్పారు. గురువారం కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని15వ వార్డు (చౌటబెట్ల) తాళ్ళనరసింగాపురం  రైతులకు మార్కెట్ యార్డులో వరి కొనుగోలులో  అన్యాయం చేశారని మాజీ మంత్రి జూపల్లి ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ రైతులతో కలిసి కొల్లాపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ను నిలదీశారు. 

సమస్యలను తెలియజేశారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులు వరి పండించారు. ఇపుడు ఆదాయం చేతికొచ్చే సమయంలో వరి కొనుగోళ్ళులో అక్రమాలు జరిగాయన్నారు. ఐదు కిలోలు దగ్గించారాన్నారు. రైతుల ఆదాయానికి గండి పడిందని అన్నారు.

బాధిత రైతులను చైర్మన్ ముందు కూర్చోబెట్టారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. మార్కెట్ యార్డ్ ల్లో ఎలాంటి పొరపాట్లు జరగలేదన్నారు.రైస్ మిల్లర్లు ఈ విధంగా చేశారన్నారు.70కిపైగాలారీ లు పంపిస్తే 50 పైగా లారిలలో ఏలాంటి పొరపాట్లు జరగలేదు అన్నారు. కేవలం చివరి ఇరవై పైగా  లారీల్లలో మాత్రమే మిల్లర్లు ఈవిధంగా చేశారన్నారు.

ఇలా రాష్ట్రం మొత్తం జరుగుతుందన్నారు. నియోజకవర్గ స్థాయిలో సమస్యను పరిష్కరిస్తే రాష్ట్ర స్థాయి  సమస్య ఎలా అవుతుందని వంగ రాజశేఖర్ గౌడ్ ప్రశ్నించారు. పండించిన పంట ఆదాయం చేతికి వస్తుందని ఎంతో  ఎదురు చూస్తున్న సమయంలో రైతుల  ఆదాయానికి గండి కొట్టడం అన్యాయమన్నారు. వేలాది రూపాయల ఆదాయం తగ్గింది అన్నారు.

బాధితులైన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పై అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని రైతులతో వినతిపత్రం ఇచ్చారు. అంతకుముందుకు మార్కెట్ యార్డ్ చైర్మన్ నరేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డికి  సమస్యను తెలియజేశారు. అనంతరం రైతులతో కలిసి వంగ రాజశేఖర్ గౌడ్ సింగిల్ విండో చైర్మన్ పెబ్బెటి కృష్ణయ్య ను కలిశారు. రైతుల సమస్యలను తెలియచేశారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.

Related posts

ములుగు జిల్లాలో టీచర్లకు ఇంగ్లీష్ మీడియం బోధనకు శిక్షణ

Satyam NEWS

ఇస్రో చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం

Satyam NEWS

ఎమోషనల్ మూమెంట్: మోడీ మీరే మా పాలిట దేవుడు

Satyam NEWS

Leave a Comment