34.2 C
Hyderabad
April 19, 2024 20: 40 PM
Slider నల్గొండ

రైస్ మిల్ డ్రైవర్ల, యాజమాన్యం మధ్య చర్చలు విఫలం

#Roshapati

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రైస్ మిల్లర్స్  అసోసియేషన్, రైస్ మిల్ డ్రైవర్ల కార్మిక సంఘాలు  5వ, దఫా జాయింట్ చర్చలు మరల వాయిదా పడ్డాయని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి తెలిపారు.

చర్చల అనంతరం స్థానిక CITU కార్యాలయం వద్ద కార్మికుల గేట్ మీటింగ్ లో శీతల రోషపతి, ఐ ఎన్ టి యు సి నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య, టిఆర్ఎస్ కెవి నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్ మాట్లాడుతూ ఈనాడు పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా రైస్ మిల్ డ్రైవర్ వేతనంపై నెలకి 3000 రూపాయలు వేతనం పెంచాలని కోరారు. ఈ చర్చల్లో యాజమాన్యం 1750 రూపాయలు పెంచుటకు ముందుకు రాగా అనంతరం మూడు రోజుల్లో మళ్లీ చర్చలు జరుపుతామని వాయిదా వేశారు.

ఈ కార్యక్రమంలో రైస్ మిల్లుల యాజమాన్యం నుండి లక్ష్మీ నరసింహ రావు, గజ్జి ప్రభాకర్, కుక్కడపు రామ్మోహన్ రావు, గెల్లి అప్పారావు, ఐ ఎన్ టి యు సి నాయకులు సలిగంటి జానయ్య, పోతన బోయిన రామ్మూర్తి, వీరబాబు, ఉపేందర్, సి ఐ టి యు నాయకులు ఎలక సోమయ్య గౌడ్, గుండెబోయిన వెంకన్న, అంజి, వెంకన్న, కనకయ్య, ఎల్లప్ప, టి ఆర్ ఎస్ టి వి నాయకులు చింతకాయల మల్లయ్య, సైదులు, ఎర్రయ్య, శీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హైదరాబాద్ లో అక్రమంగా ఉంటున్న బర్మా దేశస్థుడి అరెస్టు

Satyam NEWS

రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అమ్ముకోవద్దు

Satyam NEWS

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Bhavani

Leave a Comment