37.2 C
Hyderabad
March 28, 2024 19: 35 PM
Slider మహబూబ్ నగర్

కరోనా కట్టడిలో రెచ్చిపోతున్న బియ్యం మాఫియా

#Rice Smugling

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం లోని వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో గూడ్స్ వెహికల్ లో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులకు అప్పజెప్పినట్లు వెల్దండ ఎస్సై నర్సింహులు తెలిపారు.

కరోనా కట్టడిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యాన్ని నేటికి పేదలకు ఇవ్వకుండా రేషన్ మాఫియాకు డీలర్లు అందజేస్తూ సహకరిస్తున్నారు. కరోనా కట్టడిలో ఒకరికి 6 కిలోలు ఇస్తున్న దాన్ని రెండింతలు చేస్తూ 12 కిలోలు ఇవ్వడంతో మాఫియా చెలరేగిపోతూ వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది.

తెలంగాణ రాష్ట్రంలోనే రేషన్ మాఫియాకు పేరుగాంచిన కల్వకుర్తిలో అధికారుల సహకారం చాలానే ఉందని చెప్పుకోవాలి. జిల్లా సివిల్ సప్లై స్థానిక మిల్లర్ లతో  కుమ్మక్కై బహిర్గతం కాకుండా తొక్కేయాలని చూస్తూ నామమాత్రపు కేసులతో స్థానిక మీడియాను సైతం తప్పుదోవ పట్టిస్తూ తప్పుడు వివరాలతో దాటవేత ధోరణిని వ్యవహరిస్తున్నారు.

కల్వకుర్తిలో హైదరాబాద్ రోడ్డు లో ఉన్న ఒక రైస్ మిల్ లో ఉదయం నాలుగు గంటల నుండి 7 ,8 గంటల వరకు  ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. కల్వకుర్తిలో నేటికీ లబ్ధిదారునికి బియ్యం ఇవ్వకుండా రేషన్ షాప్ యజమానులు రేషన్ బియ్యాన్ని మిల్లర్లకు తరలిస్తున్నారు. లబ్ధిదారుని కి మాత్రం ఇంకా బియ్యం రాలేదంటూ రేపు మాపు అంటూ మొండిచేయి చూపిస్తున్నారు. ఈ కరోనా కట్టడిలో నన్న పని లేకుండా ఉన్న పేదవారిని కడుపునిండా తినే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ మాఫియా పై  చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Related posts

దుర్గమ్మ కాలనీలో గడపగడపకు మన ప్రభుత్వం

Satyam NEWS

డిజిటల్ ప్రొవైడర్ల గుత్తాధిపత్యం సమస్య పరిష్కరించాలి

Satyam NEWS

ట్వీట్ అండ్ డిలీట్: అన్నా ఇక చాలే వదిన్ని పిలువు

Satyam NEWS

Leave a Comment