32.7 C
Hyderabad
March 29, 2024 10: 35 AM
Slider నల్గొండ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని మంత్రి ఇందిరా గాంధీ వర్ధంతి

#hujurnagarcongressparty

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 37వ, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇందిరా సెంటర్లో ఉన్న ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,ముఖ్య నాయకులు మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిరోహించిన రెండవ మహిళా గా ఇందిరాగాంధీ ఖ్యాతి గడించారని, దశాబ్ధాలుగా భారతదేశానికి ప్రధాని గా బాధ్యతలను చేపట్టి క్షేత్ర స్థాయిలో రైతులకు,పేదలకు కార్మికులకు,అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు సంస్కరణలు ప్రవేశపెట్టి  ప్రజాదరణ పొందిన మహిళా మూర్తి అని కొనియాడారు.దేశంలోని మొదటిసారిగా 14 బ్యాంకు వ్యవస్థలకు 1969లో జాతీయం చేయటం జరిగిందని, అనంతరం గరీబీ హఠావో,దేశ్ కు బచావో అన్న నినాదంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారని అన్నారు.    

1974లో మొదటిసారిగా ఫోఖ్రాన్ లో అణు పరీక్షలు చేపట్టి విజయం సాధించారని,1971లో నాటి అగ్రరాజ్యమైన రష్యాతో 20 సంవత్సరాల శాంతి ఒప్పందాన్ని  కుదుర్చుకోవడం జరిగిందని గుర్తు చేశారు.మనదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయురాలని,అలీనోద్యమానికి నాయకత్వం వహించింన ధీరురాలని, 20 సూత్రాల ప్రణాళిక, భూమి లేని గ్రామీణ శ్రామికులకు పని గ్యారెంటీ కార్యక్రమం వంటి కార్యక్రమాలతో యావత్ జాతిని ఉత్తేజ పర్చాయని,1971లో భారతరత్న అవార్డు పొందిన భారతదేశ తొలి  మహిళగా గుర్తింపు పొందారని అన్నారు.

1984 అక్టోబర్ 31న,తన ప్రాణాలను కాపాడడానికి నియమించబడిన అంగరక్షకులే ఆమెను దారుణంగా ఆమె ప్రాణం తీసారని, దేశసేవ కోసం ప్రాణాలు అర్పించిన దివంగత మహ మాతృమూర్తి అని,ఆ మహా నాయకురాలి  సేవలను కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ మరువలేదని అన్నారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త  పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సరికొత్త కాంతి

Satyam NEWS

త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Satyam NEWS

ఏడిపించే వారిని ధైర్యంగా ఎదుర్కోవాలి

Satyam NEWS

Leave a Comment