26.2 C
Hyderabad
February 13, 2025 21: 45 PM
Slider గుంటూరు

నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి నివాళులు

#vijayanand

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సుభాష్ చంద్ర బోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. మాతృభూమి దాస్య శృంఖలాల నుండి విముక్తి చేయడానికి ఆనాటి అత్యున్నత సర్వీసైన ఐసిఎస్ ను తృణప్రాయంగా త్యజించిన ఘనుడు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సిఎస్  అన్నారు.

ఆనాడు భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్ర బోస్ అని సిఎస్ విజయానంద్ గుర్తు చేశారు. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సుభాష్ చంద్ర బోస్ పోరాడి విదేశాల్లోని భారతీయుల సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా వీరోచిత పోరాటం చేసిన గొప్ప యోధుడు సుభాష్ చంద్ర బోస్ అని సిఎస్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

Related posts

కర్ణాటకలో పవన్ కళ్యాణ్ “జనసేన” విస్తరిస్తున్న డి.ఎస్.రావ్-వి.సముద్ర

Satyam NEWS

తిరుమల ప్రత్యేక దర్శనం టిక్కెట్ స్కీమ్ రేపు ప్రారంభం

Satyam NEWS

మాఫియాల్లో కలిసి పోతున్న పోలీసులు: ఆనం వ్యాఖ్య

Satyam NEWS

Leave a Comment