40.2 C
Hyderabad
April 19, 2024 17: 03 PM
Slider ఆదిలాబాద్

రాజకీయ మాఫియా అడ్డాగా ఆదిలాబాద్ రిమ్స్

#MPSoyamBabuRao

ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రి  అధికార పార్టీ నేతలకు ఆదాయ వనరుల కేంద్రంగా మారిందని, ఖాళీగా పేరుకుపోయిన వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడం వల్లే రోగులు అనేక అవస్థలు పడుతున్నారని, కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎంపీ సోయం బాపురావు అన్నారు.

ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ కొందరు డాక్టర్లు తమ స్వార్థం కోసం రాజకీయ పార్టీల నేతలతో కుమ్మక్కై ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని విమర్శించారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఎదుట బీజేపీ మహాధర్నా ప్రతిష్టాత్మక రిమ్స్ మరి ఆదిలాబాద్ జిల్లాలో 2008లో  స్థాపించారు కానీ దీని పూర్తి స్థాయి సేవలు పేదలకు అందడం లేదన్నారు. దీనికి ముఖ్య కారణం కొందరు డాక్టర్లు రాజకీయ నాయకులు రిమ్స్ ని ఒక మాఫియా అడ్డా గా మార్చుకుని సంపాదనే ధ్యేయంగా ఒక రెగ్యులర్  ఇన్కమ్ సెంటర్ గా మార్చుకుని పేదలకు ఇబ్బంది  చేస్తున్నారని అన్నారు. 

జిల్లా అధ్యక్షులు పాయల్  శంకర్ మాట్లాడుతూ నలుగురు ఐదుగురు డాక్టర్లు వారి స్వార్థం కోసం స్థానిక ప్రజాప్రతినిధులకు కుమ్మక్కై నిజాయితీగా పనిచేసే డాక్టర్లను ఇక్కడ నియామకాలు జరగకుండా  సీనియర్ ప్రొఫెసర్ స్థాయి డాక్టర్లు అడ్డు పడుతున్నారని అన్నారు.

కొందరి రాజకీయ లబ్ధి కోసం డాక్టర్ల లబ్దికోసం నియామకాలు జరగకుండా అడ్డుపడుతున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులు వీరికి సహకరించడం చాలా విడ్డూరంగా ఉంది అన్నారు. దీనివలన ఉమ్మడి జిల్లాలో పేద మరియు గిరిజనులకు న్యాయమైన వైద్య సేవలు అందక పోవడంతో చాలా మంది చనిపోతున్నారని అన్నారు. 

రిమ్స్ తర్వాత స్థాపించిన నిజామాబాద్ మెడికల్ కాలేజీలో అందరు డాక్టర్లు ప్రొఫెసర్లు పీజీ డైరెక్టర్ సీనియర్ డాక్టర్లను నియమించారని, ఆరోగ్య శ్రీ లో కూడా చాలా అవకతవకలు గతంలో జరిగాయి ఇప్పుడు కూడా జరుగుతున్నాయని అన్నారు.

ఉదాహరణకు శాస్త్ర చికిత్స పరికరాలు రోగులను బయట నుంచి తెచ్చుకుంటున్నారు ఒకవేళ బయటకు లేకపోతే రోగులను వేధించడం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు రోజుకు దాదాపు ఒక లక్ష రూపాయల హాస్పిటల్  వెంటనే సైనా ఎప్పుడూ కూడా హాస్పిటల్ కంపు కొడుతూనే ఉంటుంది.

ఒకరోజు డాక్టర్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసే దాఖలాలు ఎక్కడా కూడా లేవు డాక్టర్ల నియామకాలు 15 రోజులలో పూర్తి చేయాలి లేదంటే సీఎం కేసీఆర్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాంపల్లి వేణుగోపాల్, ఆకుల ప్రవీణ్ కౌన్సిలర్ లాలా మున్నా సోము రవి భూమన్న రాజేష్ శ్రీనివాస్ జిల్లా నాయకులు లోక ప్రవీణ్ రెడ్డి ధోని జ్యోతి గంగామణి బాబా రావు పటేల్ మనజీ  జిల్లా నాయకులు మండల అధ్యక్షులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి ని విమర్శించే స్థాయి భత్యాల కు లేదు

Satyam NEWS

అపర తిరుపతి మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

Bhavani

Leave a Comment