35.2 C
Hyderabad
April 20, 2024 15: 44 PM
Slider శ్రీకాకుళం

వేతనాలు తక్షణమే చెల్లించాలని రిమ్స్ కార్మికుల డిమాండ్

#RIMSSrikakulam

పారిశుద్ధ్య, సెక్యూర్టీ  కార్మికులకు బకాయి పడిన రెండు నెలల వేతనాలు, మూడు నెలల గా బకాయి పడిన కోవిడ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని శ్రీకాకుళం రిమ్స్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

ఈ రోజు రిమ్స్ ఆవరణలో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా  ఏఐసిసిటియు జిల్లా కన్వీనర్  గణేష్ మాట్లాడుతూ  యాజమాన్యం వారు ప్రతినెల వేతనాలు చెల్లించకుండా కార్మికులను చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు.

గతంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రిమ్స్ ఆసుపత్రికి వచ్చినప్పుడు  కాంట్రాక్టర్ ను తొలగిస్తామని చెప్పి 5 నెలలు గడుస్తున్నా వారే కొనసాగడం చాలా విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు. మంత్రి అదేశాలే అమలుకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు.

549 జీవో ప్రకారం 2020 జనవరి నుంచి 16 వేల రూపాయలు ఇస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి హామీయే నేటికి అమలు కాలేదని అన్నారు. తక్షణమే జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఆకుల శ్యామల, దమ్ము సింహాచలం, బి సంతోషి, కె ఈశ్వరమ్మ, ఇల్లంనాయుడు, కొప్ప ల రాజశేఖర్, డి భారతి,సరస్వతి, బి నారాయణరావు, మౌనిక, దమయంతి, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

గురుమూర్తికి వచ్చే మెజార్టీ ఢిల్లీ వరకు రీసౌండ్‌ వినిపించాలి

Satyam NEWS

వైకాపా నేతల కనుసన్నల్లో జూదం మాఫియా

Bhavani

అగ్నిప్రమాదాల నివారణ పై అవగాహన ఉండాలి

Bhavani

Leave a Comment