27.7 C
Hyderabad
April 25, 2024 10: 39 AM
Slider ప్రత్యేకం

దారుణం: డబ్బు కట్టకపోతే వెంటిలేటర్ తీసేస్తాం

#RiseHospital

కరోనా బారిన పడి చికిత్స కోసం వస్తే హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లోని రైస్ చిల్డ్రన్ హాస్పిటల్ డబ్బులు గుంజిపారేస్తున్నది. ఇప్పటికే 7 లక్షలు చెల్లించగా ఇంకా డబ్బులు కట్టాలని ఆ ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తున్నది. ఇంతకీ ఆ రోగి బతుకుతాడా అంటే అది కేవలం ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉందట. ఇదంతా ఎవరికో కాదు ఒక జర్నలిస్టుకే జరుగుతున్నది. టీవీ9 రిపోర్టర్ ఒకరు కోవిడ్ బారిన పడి  హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ లోని రైస్ చిల్డ్రన్ హాస్పిటల్ లో చేరాడు. 5 రోజులకు 15 లక్షలు బిల్ వేశారు. ఇప్పుడు కండిషన్ సీరియస్ అంటున్నారు. వేరే ఆసుపత్రికి తరలిస్తామంటే ఆసుపత్రి అడ్డుకుంటున్నది. అసలు ఆ ఆసుపత్రికి కరోనా రోగులకు చికిత్స చేసే అనుమతే లేదు. అయినా కరోనా రోగులను చేర్చుకుని ఇలా డబ్బులు గుంజేస్తున్నారు. డబ్బులు కట్టకపోతే వెంటిలేటర్ తొలగిస్తాం అంటూ బెదిరిస్తున్నది యాజమాన్యం.

Related posts

గోవాలో ఆగని మరణ మృదంగం: మరో 13 మంది మృతి

Satyam NEWS

కాంట్రాక్టర్ నిర్లక్ష్యంలో పండగపూట ఇండ్లలోకి మురికి నీరు

Satyam NEWS

మోడీ పాలనలో బీడీ కార్మికుల బతుకులు ఆగం

Bhavani

Leave a Comment