37.2 C
Hyderabad
March 29, 2024 20: 46 PM
Slider ఆధ్యాత్మికం

రేపటి నుంచి తుంగభద్ర నది కి పుష్కరాలు

#TungabhadraDam

తుంగభద్ర పుష్కరాల కోసం అలంపూర్ ముస్తాబైంది. పుష్కరాలను విజయవంతం చేయడానికి జోగులాంబ‌- గ‌ద్వాల్  జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. నవంబరు 20 తేదీ నుంచి డిసెంబరు 1 తేదీ వరకూ 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వ‌హించ‌నున్నారు.  తొలి రోజు (శుక్రవారం) పుష్కరాల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  పాల్గొననున్నారు. అలంపూర్ ‌ ఘాట్‌ వద్ద  మ‌ధ్యాహ్నం 1.23 గంట‌ల‌కు  తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి,  హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ శాస్త్రోక్తంగా ఈ పుష్క‌రాల‌ను ప్రారంభించ‌నున్నారు. 

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. తుంగభద్ర పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కోట్లను విడుదల  చేసింద‌న్నారు.

పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు 100కు పైగా  పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేశామ‌న్నారు. పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవదాయ శాఖ నిర్ణ‌యించింద‌ని, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనుంచనున్న‌ట్లు పేర్కొన్నారు.  

పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ప్ర‌త్యేక అధికారులు, దేవదాయ శాఖ సిబ్బందిని  విధుల్లో నియమించార‌న్నారు.

తుంగ‌భ‌ద్ర పుష్క‌రాలపై రాష్ట్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాలు

తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల‌పై రాష్ర్ట ప్ర‌భుత్వం మార్గ‌ద‌ర్శ‌కాలు విడుద‌ల చేసింది. ఈ 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని సూచించింది. క‌రోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన వారికే పుష్క‌ర ‌ఘాట్ల‌లోకి అనుమ‌తించ‌నున్నారు. టెస్టు రిపోర్టు లేకుండా వ‌చ్చే వారికి థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అనంత‌రం అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారికి పుష్క‌ర‌ఘాట్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌నున్నారు. పుష్క‌ర‌ఘాట్లు, ఆల‌య ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద శానిటైజ‌ర్లు, థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉంచ‌నున్నారు. మాస్కు ధ‌రించ‌డం, ఆరు అడుగుల భౌతిక దూరం త‌ప్ప‌నిస‌రి చేసింది. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పుష్క‌ర స్నానాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.

Related posts

మారుమూల ప్రాంతమైన కొల్లాపూర్ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య

Satyam NEWS

జనసేన అధినేత పర్యటన కు ముందు గానే జగన్ ప్రభుత్వం అలెర్ట్

Satyam NEWS

బిచ్చం వేసి ఆర్టీసీని ఆదుకోండి ప్లీజ్

Satyam NEWS

Leave a Comment