రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తా మృతి చెందగా 11 నెలల చిన్నారి అనాథగా మారింది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవల్లి పంచాయితీ అవ్వపేట వద్ద జాతీయ రహదారి పై ఈ దుర్ఘటన జరిగింది. పడాల శ్రీనివాసరావు (30) ఆయన భార్య స్వాతి (29) 11 నెలల చిన్నారి తన్వీర్ తో కలిసి ద్విచక్ర వాహనంపై శ్రీకాకుళం నుంచి విశాఖ వైపునకు వెళుతుండగా వెనక నుంచి వచ్చిన లారీ వారిని ఢీకొన్నది.
దాంతో పడాల శ్రీనివాసరావు అక్కడికక్కడే మరణించాడు. స్వాతి, చిన్నారి తన్వీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన స్వాతి, తన్వీర్ లను భోగాపురం ఎస్ ఐ శ్యామల తన వాహనంలో స్దానిక సుందరపేట సిహెచ్ సి కి తరలించారు.