23.7 C
Hyderabad
July 14, 2024 06: 20 AM
Slider తెలంగాణ

ఆటో బోల్తా ఐదుగురికి తీవ్ర గాయాలు

kollapur 56

కొల్లాపూర్ పురపాలక సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో ముక్కిడి గుండం  గ్రామానికి వెళుతున్న ఆటో బోల్తా పడి  ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే కొల్లాపూర్ మండలం ముక్కిడి గుండం గ్రామానికి చెందిన ప్రజలు పద్ఘావత్ రాజు నాయక్28, శారదా, సుల్తాన  మరి కొందరు కొల్లాపూర్ పట్టణానికి సొంత పనుల మీద వచ్చారు. తిరిగి సాయంత్రం సున్నపు తాండ కు చెందిన ఆటోలో గ్రామానికి ప్రయాణమయ్యారు. కొల్లాపూర్ పురపాలక పరిధిలో చుక్కాయి పల్లి గ్రామ సమీపంలో చెరువు కట్ట పక్కల, చింత చెట్టు దగ్గర ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరికీ సీరియస్ గా ఉందని డాక్టర్ భరత్ తెలిపారు. ఎస్సై విమోచన సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన  వివరాలు  సేకరిస్తున్నారు. బాధితులను కొల్లాపూర్ వైస్ ఎంపీపీ బొజ్యా నాయక్,ఎమ్మెల్యే  బీరం హర్షవర్ధన్ రెడ్డి అనుచరవర్గం, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు ముచ్చర్ల వేణు గోపాల్ యాదవ్, ముచ్చర్ల రాంచందర్ యాదవ్, మల్లయ్య, ముక్కిడి గుండం గ్రామ సర్పంచ్ దశరథ్ నాయక్ పరామర్శించారు. సీరియస్ గా ఉన్న బాధితులను మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు.

Related posts

బలివె వచ్చిన భక్తులకు ఆహార వితరణ సేవ

Satyam NEWS

40 మంది దళితబంధు లబ్దిదారులకు మంజూరు పత్రాల అందజేత

Satyam NEWS

నా భర్త నాతో కాపురం చేయడం లేదు సార్

Satyam NEWS

Leave a Comment