Slider ముఖ్యంశాలు

ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులతో సహా మరో మహిళ మృతి

#Chityala Road Accedent

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ శివారులో జాతీయ రహదారి 65 పై గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో దంపతులతో సహా మరో మహిళ మృత్యు వాత పడ్డారు. మరో గంట సేపట్లో గమ్య స్థానం చేరుకోవల్సిన వారిని మృత్యువు తన ఒడిలోకి తీసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి కి చెందిన గిరిశాల శ్రీనివాస్(45) కుటుంబ సభ్యులతో కలిసి తన స్వగ్రామం నుండి హైదరాబాద్ కు ఏర్తికా కారులో బయలుదేరారు.

వీరు ప్రయాణిస్తున్న కారు చిట్యాల శివారులో జాతీయ రహదారి పక్కన ధాన్యం లోడుతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అతని భార్య లక్ష్మీ(30)తో పాటు మరో మహిళ లక్ష్మీ చందన(28) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు చిన్నారులు ప్రమాదం నుండి బయట పడ్డారు.

వీరు కాకుండా మరో ఇరువురికి ప్రాణాపాయం తప్పింది. సంఘటన స్థలానికి డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించారు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ రాజు తెలిపారు.

Related posts

రాష్ట్రంలో ఆరు శాతం కల్వకుంట్ల సేల్స్ ట్యాక్స్

Satyam NEWS

ఎలా స్వాగతించాలి…?

Satyam NEWS

సీనియర్ సంగీత దర్శకుడు రాజ్ కన్నుమూత

mamatha

Leave a Comment