జనగాం జిల్లా లో పెంబర్తి గ్రామం వద్ద బుధవారం తెల్లవారు జామున ఆర్టీసీ బస్సు లారీ ఢీ కొన్న సంఘటన జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్రగాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు ప్రయాణికులకు స్వల్పంగా గాయాలు అయ్యాయి. స్థానికుల కధనం ప్రకారం హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరబాద్ కువెళ్లి తిరిగి ప్రయాణికులను తీసుకొని హన్మకొండ కు వస్తున్న క్రమం లో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు మరమ్మత్తుల కరణంగా వన్ వే ఉండడం వల్లన నిద్ర మత్తులో డ్రైవర్ ఉండడం తో వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నది. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని ప్రమాదాలకు గురైన వాహనాలను ప్రక్క జరిపి ప్రయాణికులను ఇతర బస్సులో పంపించారు. ఇద్దరు డ్రైవర్లను తీవ్రగాయాలు కావడం తో వారి పరిస్థితి విషమంగా వుండడం తో హుటాహుటిన హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.