పశ్చిమ గోదావరి జిల్లా పెడవేగి మండలం లో కూచింపూడి రామసింగవరం గ్రామాల మధ్య రోజు రోజుకు రోడ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల మధ్య ఉన్న మద్యం షాపు వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఈ గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు.
మద్యం తాగిన కొంతమంది యువత తమ ద్విచక్ర వాహనాలను మితి మీరిన వేగంతో మద్యం మత్తులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తి అధ్యయనం చేసి మద్యం షాపు ప్రధాన రహదారి ప్రక్కన కాకుండా వేరే చోటకు మార్చి ఈ రహదారిలో ఇంకా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఈ రోడ్ ప్రమాదాలకు గురై న బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.