వనపర్తిలో రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్బంగా జిల్లా రవాణా శాఖ(ట్రాన్స్ పోర్ట్) కార్యాలయం ఆవరణలో వాహనాల వారికీ గులాబీ పూలు ఇచ్చి భద్రత గురించి వివరించారు. హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.జిల్లా రవాణా అధికారి మానస ఆధ్వర్యంలో వాహనాల వారికి వారోత్సవాల గురించి తెలిపారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ఎఎంవిఐ సైదులు, ఎ.ఓ. సబెరా భాను, సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్