February 28, 2024 09: 18 AM
Slider మహబూబ్ నగర్

రోడ్డును ప్లాట్ చేసి అమ్ముకున్న ఘనులు

#road

వనపర్తి జిల్లా కేంద్రానికి సమీపంలో వనపర్తి మునిసిపల్ పరిధిలో నర్సింగాయిపల్లి శివారులో రాఘవేంద్ర కాలనీ లో సి బ్లాక్ తాడిపర్తి గ్రామపంచాయతీ నుండి  అనుమతి పొందిన ప్రాంతంలో దక్షిణ వైపులో రోడ్డు చూపారు. తాడపర్తి గ్రామ పంచాయతీ నుండి అనుమతి పొందిన ప్రకారం రోడ్డు లేకుండా ప్లాట్లు చేసి అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని 154వ ప్లాట్ నెంబర్ యజమాని బొడ్డుపల్లి సతీష్ సెల్ నెంబర్ 9912760211 జిల్లా ఎస్పీకి ఇచిన ఫిర్యాదులో  ఫిర్యాదులో కోరారు. రోడ్డు లేకుండా బై నెంబర్ వేసి ఫ్లాట్ చేసి అమ్మిన వారిపై చర్యలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినందుకు బై నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేయరాదని మున్సిపల్ కమిషనర్  వనపర్తి సబ్ రిజిస్టర్ కు 17-7-2023, నాడు21-7-2023 నాడు లెటర్ పంపారని తెలిపారు.

కానీ సబ్ రిజిస్టర్ మాత్రం బై నెంబర్ వేసిన ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారని, ఆయన తెలిపారు. వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశామన్నారు.18-12-2023 నాడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎస్పీ కార్యాలయం ఫిర్యాదు నెంబరు181223/0 077, ఐదు మంది పై చర్యలుతీసుకోవాలని ఆయన కోరారు. తాడిపర్తి గ్రామ పంచాయతీ అనుమతి లెటర్ ప్లాన్ లో మొత్తం భూమి 20 ఎకరాలు ఉంది. తాడిపర్తి గ్రామ పంచాయతీ లే అవుట్ నెంబర్ 4262/ 2006 ప్రకారం తేదీ 13-7-2022 నాడు వెంచర్ దగ్గర తనిఖీ చేయగా ప్లాట్లలో ఇండ్లు నిర్మించలేదని కమిషనర్  జిల్లా కలెక్టర్ కు, సబ్ రిజిస్టర్ కు లెటర్ పంపారని బొడ్డుపల్లి సతీష్ కుమార్ తెలిపారు.

నాగర్ కర్నూల్ సబ్ రిజిస్టర్ కార్యాలయం డాక్యుమెంట్ లో తేదీ 28/12/2006 నుండి 16-5-2007 వరకు భూమినీ రైతుల నుండి వనపర్తికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు  కొన్నారని తెలిపారు. తేదీ 6-7-2015 నాడు అస్రా బేగం ప్లాట్ 154 నెంబర్ ప్లాటును కొన్నారని ఆ సమయంలో ప్లాన్ లో రెండువైపులా రోడ్డు ఉంద న్నారు. తేదీ 4-2-2019 నాడు అసరా బేగం నుండి తాను  154 నెంబర్ ప్లాట్ కొన్నామని బొడ్డుపల్లి సతీష్ చెప్పారు. 2006 నుంచి 2019 వరకు ప్లాన్లో రెండువైపుల రోడ్డు ఉందని, ఆ రోడ్డును మాయం చేసి రోడ్డును ప్లాట్లు చేసి, బై నెంబర్ వేసి, వనపర్తి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అమ్మినారని ఆయన తెలిపారు. 2006లో ఉన్న ప్లాన్ ను, కమిషనర్ లెటర్ ను పరిశీలించి సబ్ రిజిస్టర్ పై, రోడ్డును అమ్ముకున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మొదటి ప్లాను ప్రకారం రెండు వైపులా రోడ్లు చూపించాలని  కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

23న తిరుమల రానున్న ముఖ్యమంత్రి జగన్

Sub Editor

హజ్ యాత్రికులకు ప్రత్యేక సౌకర్యాలు

Bhavani

ప్రతి బస్తీలో పరిశుభ్రతను పాటించేలా తగిన చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!