39.2 C
Hyderabad
March 28, 2024 15: 48 PM
Slider క్రీడలు

మంత్రిని కలిసిన రోలార్ స్కేటింగ్ క్రీడాకారుడు

#minister

రోలార్ స్కేటింగ్ ప్రముఖ క్రీడాకారుడు, అర్జున అవార్డు (2015) గ్రహీత అనూప్ కుమార్ యామ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడా పర్యాటక సాంస్కృతిక యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ V. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో కలిశారు. తనకు హైదరాబాద్ లో క్రీడాకారుల కేటగిరీ లో ఇంటి స్థలాన్ని, గ్రూప్ -1  స్థాయి ప్రభుత్వ ఉద్యోగాన్ని, రోలార్ స్కేటింగ్ అకాడమీ ఏర్పాటు కు అవసరమైన స్థలాన్ని కేటాయించాని మంత్రికి వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్బంగా అనూప్ కుమార్ ఇచ్చిన వినతి పత్రం పై మంత్రి సానుకూలంగా స్పందించారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రోలర్ స్కేటింగ్ క్రీడను తెలంగాణ క్రీడా శాఖ ప్రోత్సహిస్తుందని మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో MLC రాజేశ్వర్ రావు, మాజీ ఛైర్మన్ బాద్మీ శివకుమార్, రోలర్ స్కేటింగ్ నేషనల్ ఛాంపియన్ పడిగ తేజేష్, సాగర్, హన్వాడ BRS అద్యక్షులు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా ఆసుపత్రిగా లింగంగుంట్ల ప్రభుత్వ ఆసుపత్రి

Bhavani

మందు బాబులను శాలువతో సన్మానించిన టీడీపీ నేత

Satyam NEWS

శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రతిభకు జాతీయ గుర్తింపు

Satyam NEWS

Leave a Comment