27.7 C
Hyderabad
April 26, 2024 05: 17 AM
Slider ఆధ్యాత్మికం

నిమిషాల్లో గదులు

#tirumala

ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని ఏప్రిల్‌ 1నుంచి పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీతో తిరుమలకు వచ్చే భక్తులు 5 నుంచి 10 నిమిషాల్లోనే గదులు పొందుతున్నట్టు టి‌టి‌డి ఈవో వెల్లడించారు. ఇదే సమయంలో తిరుమలలో 60 ఏళ్ల నాటి వసతి నివాసాలను ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమలలో దాదాపు 7500 వసతి గదులు అందుబాటులో ఉన్నాయి. అందులో సిఫార్సు లేఖలపైన వచ్చే వారికి ఎక్కవ మొత్తంలో చెల్లించే గదులను కేటాయిస్తారు. సాధారణ భక్తులకు కేటాయించే గదులకు సంబంధించి పలు మార్లు మరమత్తులు అవసరం అవుతోంది. దీంతో, భక్తులకు కావాల్సిన సౌకర్యాలతో వీటిని పూర్తిగా ఆధునీకరించాలని టీటీడీ నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియ కొనసాగుతోంది.

Related posts

ఘనంగా కాటమయ్య పండుగ

Bhavani

గంజాయి కోసం ఆబ్కారీ అధికారుల వేట

Satyam NEWS

ప్రభాస్ మద్దతు కు కేటిఆర్ కృతజ్ఞతలు

Satyam NEWS

Leave a Comment