31.7 C
Hyderabad
April 24, 2024 23: 39 PM
Slider గుంటూరు

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి రోశయ్య కాంస్య విగ్రహావిష్కరణ

#rosaiah

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు నాడు రాష్ట్ర మాజీ గవర్నర్ స్వర్గీయ కొణిజేటి రోశయ్య కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో ఘనంగా జరిగింది. నరసరావుపేట లోని శివుని బొమ్మ వద్ద కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, గుంటూరు పశ్చిమఎమ్మెల్యే మద్దాలి గిరిధర్  పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ రోశయ్య రాజకీయంగా ఎన్నో ఉన్నత పదవులను అలంకరించారు అని, మంచి ఆలోచనలతో రాజకీయాలు చేయవచ్చని తెలియజేసిన వ్యక్తి రోశయ్య అన్నారు. సమయస్ఫూర్తి, చతురత కలిగిన రాజకీయ వేత్త అన్నారు.

గొప్పగా ఎదిగిన వ్యక్తుల జీవితాల్ని, వారు అందించిన సేవలను కులాలకి, రాజకీయాలకు అతీతంగా స్మరించుకోవాలి అని అన్నారు. రోశయ్య గారి కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ఎంపీ ప్రస్తావించారు. రోశయ్య గారి విధానాలని, ఆశయాల్ని జనంలోకి మరింత తీసుకు వెళ్ళాలి అని ఎంపీ కోరారు.

Related posts

విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రానిది సక్సెస్ స్టోరీ

Bhavani

సీబీఐ కోర్టుకు జగన్ మళ్లీ ఎప్పుడు రావాలి?

Satyam NEWS

ఆ జిల్లా కేంద్రంలో పొద్దున్నే ట్రాఫిక్ పోలీసుల‌కు ప‌ని…! అదేంటంటే…?

Satyam NEWS

Leave a Comment