27.7 C
Hyderabad
April 20, 2024 01: 25 AM
Slider నల్గొండ

జులై 3న దేశవ్యాప్త నిరసనలను జయప్రదం చేయండి

#Round Table Conference

పేదల సంక్షేమం కోసం జులై 3న దేశవ్యాప్తంగా జరిపి తలపెట్టిన నిరసనల కార్యక్రమాలను ప్రతి మండల కేంద్రంలో నిర్వహించి తహసీల్దార్ కు వినతిపత్రం అందజేయాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ పట్టణంలోని INTUC కార్యాలయంలో నేడు అఖిలపక్ష కార్మిక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి AITUC అధ్యక్షుడు జడ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. INTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు నెలకు 7500 రూపాయలు పది నెలల పాటు వారి బ్యాంకు ఎకౌంటులో ప్రభుత్వం జమచేయాలని, ప్రభుత్వ ఉద్యోగస్తుల వేతనాల్లో కోతలు ఆపాలని,ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయటం ఆపాలని,కార్మిక చట్టాల సవరణను నిలిపివేయాలని కోరారు.

ప్రభుత్వ – ప్రయివేటు రంగాలలో కరోన సమయంలో అక్రమ తొలగింపులను నిలిపివేయాలన్న డిమాండ్లతో నిరసన కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా INTUC కార్యదర్శి సలిగంటి జానయ్య, నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లంకొండ గురవయ్య పాల్గొన్నారు.

ఇంకా, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఇంటి అచ్చమ్మ, AITU ప్రాంతీయ గౌరవ అధ్యక్షుడు ఇందిరా వెంకటేశ్వర్లు, పట్టణ ఐ ఎన్ టి యు సి అధ్యక్షుడు పాశం రామరాజు, మండల అధ్యక్షుడు మేళ్లచెరువు ముక్కంటి, మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, జెట్టి ప్రసాదు, గుండెబోయిన వెంకన్న, ఉప్పతల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రివర్స్ గేర్ :కెటిఆర్ కారు ను అడ్డుకున్న ట్రాఫిక్ కానిస్టేబుల్

Satyam NEWS

వైసీపీ నేతల ఉపాధి హామీ పథకంలా కరోనా మహమ్మారి

Satyam NEWS

వర్కింగ్ స్పీకర్: నిజాంసాగర్ నీటిని జాగ్రత్తగా వాడాలె

Satyam NEWS

Leave a Comment