28.7 C
Hyderabad
April 20, 2024 04: 19 AM
Slider నల్గొండ

ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళన విజయవంతం చేయండి

#CITU Hujurabad

కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా జూలై 23 నుండి ఆగస్టు 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళనలను విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరి రావు పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం సి ఐ టి యు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన సి ఐ టి యు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం మార్చి 22 జనతా కర్ఫ్యూ 24 నుండి  లాక్ డౌన్ ప్రకటించినప్పటి దేశంలో కోవిడ్ -19 భయంకరంగా విస్తరిస్తుందని, లక్షలాది మందికి కరోనా సోకుతుందని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు covid – 19 పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యపు ధోరణి తగదని ఆయన అన్నారు.

నిర్భర్ భారత్ పథకం క్రింద 20 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ప్రకటించగా ఆర్థిక మంత్రి ఐదు రోజులపాటు పథకాలను ప్రకటించింది కానీ, ఆచరణలో ఈ పథకాలను ఆర్థిక శాఖ మంత్రి కార్పొరేట్లకు ప్రయోజనం చేకూర్చేలా ఉంది కానీ ప్రజల శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా లేదు అన్నారు.

ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నేపథ్యంలో పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై మండిపడ్డారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి దుగ్గి బ్రహ్మం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు,శీతల రోషపతి, యల్క సోమయ్య గౌడ్, పోసనబోయిన హుస్సేన్, బండి గోపి, షేక్ నాగుల్ మీరా, సోమాల కోటమ్మ ,స్వరూప, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వాన తెచ్చిన కప్పలకు విడాకులు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం టూటౌన్ పీఎస్ కొత్త భ‌వ‌నాన్ని ప్రారంభించిన పోలీస్ చీఫ్

Satyam NEWS

కరోనా ఫోన్: ఖళ్లు ఖళ్లు దగ్గు ట్యూన్‌తో కాలయాపన

Satyam NEWS

Leave a Comment