39.2 C
Hyderabad
April 18, 2024 15: 56 PM
Slider వరంగల్

సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటమే శరణ్యం

#mulugu teachers

ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని వివిధ ఉపాధ్యాయ సంఘాల  జిల్లా బాధ్యుల రౌండ్ టేబుల్  సమావేశం నిర్ణయించింది. ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని STU భవన్ లో ఉపాధ్యాయ సమస్యల పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా సమావేశం లో పలు ఉపాధ్యాయ   సమస్యలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఏటూరునాగారం, కన్నాయిగూడెం, వెంకటాపూర్ మండలం లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యల ను పరిష్కరించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని వక్తలు అన్నారు.  వర్క్ అడ్జస్ట్మెంట్ నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ డెప్యూటషన్  లకు  వేస్తూ ఉపాధ్యాయులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని వారన్నారు.  ఉపాధ్యాయుల సేవా పుస్తకాలను అప్డేట్ చేయకుండా తీవ్ర జాప్యం చేస్తూ  ఉపాధ్యాయుల పట్ల నిరంకుశ ధోరణిని అవలంబిస్తున్నారని అన్నారు. సదరు మండలాల ఇంచార్జ్ విద్యా శాఖ అధికారి పై శాఖా పరమైన చర్యలు తీసుకొంటూ మండల విద్యా శాఖ అధికారి  బాధ్యత ల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో STU ములుగు జిల్లా అధ్యక్షుడు ఏళ్ళ మధుసూదన్, TTU జిల్లా అధ్యక్షుడు సర్వర్ అహ్మద్, DTF జిల్లా బాధ్యులు దబ్బా సుధాకర్, T PRTU జిల్లా అధ్యక్షుడు ప్రసాద్,  SLTA అధ్యక్షుడు K  కృష్ణమూర్తి,

UTF జిల్లా  ప్రతినిధి జక్కుల వెంకట స్వామి ,TWTU. జిల్లా అధ్యక్షుడు యాలం అది నారాయణ, ATA బాధ్యులు సూర్య నారాయణ, బండారి జగదీశ్, దాసరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Related posts

కార్మికుల న్యాయమైన కోర్కెలు తీర్చాలి: సి ఐ టి యు

Satyam NEWS

ఏసీబీ కోర్టులో ఈఎస్‌ఐ స్కాం నిందితుడు స‌రేండ‌ర్

Sub Editor

పల్లె ప్రగతి: సేంద్రియ ఎరువు తయారీపై శిక్షణ

Satyam NEWS

Leave a Comment