35.2 C
Hyderabad
April 20, 2024 18: 36 PM
Slider వరంగల్

గిరిజన యూనివర్సిటీని వెంటనే ప్రారంభించాలి

#TSR TP Mulugu

వైఎస్ఆర్ టిపి సన్నాహక కమిటీ ఆధ్వర్యంలో నేడు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ములుగు జిల్లా ఇంచర్ల హరిత కాకతీయ హాల్లో జరిగిన ఈ సమావేశానికి ములుగు జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ రామ సహాయం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.

ప్రజా సంఘాలు, కుల సంఘాల తమ సమూహాలకి, సంఘాలకు ఏమి కావాలి  ఏం కోల్పోయారు అనే విషయాలు చెబితే పార్టీ కార్యక్రమం ఎజెండా నిరూపించుకుంటామని ఆయన అన్నారు. అందుకోసం అందరూ అభిప్రాయాలను చెప్పాలని ఆయన కోరారు.

పోడు భూములకు  పట్టాలు ఇవ్వాలని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని, ఆదివాసులకు సమానంగా ఏజెన్సీ దళితుల ప్రాంతాల్లో హక్కులు కల్పించాలని, ఏజెన్సీ చట్టాలు అమలు చేయాలని, బెల్ట్ పరిశ్రమను పునరుద్ధరించాలని, సామాజిక వర్గాల ప్రతిపాదన కార్పోరేషన్లు ఏర్పాటు చేయాలని వక్తలు తెలియ పరిచారు.

ఈ కార్యక్రమంలో వట్టం ఉపేందర్, కొమురం ప్రభాకర్, మొగుళ్ళ భద్రయ్య, ఆషాడ పు దేవేందర్, చాంద్ పాషా, పరక సుమన్, పరక శ్రీను, బోనగని యాదగిరి, సుదర్శన్, శనిగరపు చిరంజీవి, గంపల శివ, శివ కుమార్ తదితర వక్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా వైయస్సార్సీపి ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ దేవా నాయక్, ఉమ్మడి జిల్లా కమిటీ మెంబర్లు బజారు శ్యాంప్రసాద్, పిన్ రెడ్డి రాజి రెడ్డి, ములుగు మండల అధ్యక్షుడు ఎండి చాంద్ పాషా, తాడ్వాయి మండల పార్టీ అధ్యక్షులు బాగే నరసింహులు, పార్టీ నాయకులు అన్న తిరుపతి, దుగ్యాల ప్రవీణ్, అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుటకు రామ్ గోపాల్ వర్మ

Satyam NEWS

స్వామివారి వెండి కిరీటం మాయం వాస్తవమే

Satyam NEWS

వాట్ యాన్ ఐడియా సర్ జీ: ఏటీఎం మిషనే ఎత్తుకెళ్లారు

Satyam NEWS

Leave a Comment