కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గోదావరి నదిలో వరద సమయంలో విహార యాత్రకు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు మునిగిపోయి 30 మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ఆ రోజు నుండి నిన్నటి వరకు బోటు తీసే ప్రయత్నంలో చివరకు ధర్మాడి సత్యం బృందం సఫలం అయింది. లంగర్ లు ఐరన్ రోప్ ల సహాయంతో ఈ బోటును బయటకు తీశారు. మరి కాసేపట్లో ఆబోటును ఒడ్డుకు తీసుకురానున్నారు.
previous post