24.7 C
Hyderabad
March 29, 2024 06: 49 AM
Slider ముఖ్యంశాలు

రఘురామ అరెస్టుకు తెలంగాణ బిజెపి ఖండన

#Bandi Sainjai

ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంపీ రఘురామ కృష్టం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా… బలవంతంగా కారులోకి తోస్తారా.. ఒక గౌరవ ఎంపీని ఏపీ పోలీసులు అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి లేకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా అనుమతించింది? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణాలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా … లేక తమ మిత్రుడైన ఏపీ సీఎం కోసం అన్నీ నిబంధనల్ని తుంగలోకి తొక్కి నియంతృత్వ పాలన చేస్తున్నారో అర్థం కావట్లేదని ఆయన అన్నారు. మఫ్టీ లో వచ్చిన వాళ్ళను చూస్తుంటే పోలీసులో.. కిడ్నాపర్లో అర్థం కాలేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

ఎంపీ ని కిడ్నాప్ చేశారో, అరెస్టు చేశారో ఆయన కుటుంబ సభ్యులకు కొద్దీ సేపు అర్థం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తోందని ఆయన అన్నారు. రఘురామ కృష్ణం రాజుకు 4 నెలల కిందట హార్ట్ సర్జరీ అయింది. ఒక హార్ట్ పేషెంట్ తో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? అని బండి ప్రశ్నించారు.

ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్ హాస్పిటలకు వస్తున్న ఏపీ అంబులెన్సు లను బార్డర్ లో ఆపేస్తున్నతెలంగాణా సర్కార్ ఒక గౌరవ ఎంపీని అరెస్టు చేసేందుకు ఏవిధంగా పోలీసులను రాష్ట్రంలోకి అనుమతించింది? అని ఆయన ప్రశ్నించారు.

ఎంపీకి ఎన్నో రకాల ప్రివిలేజేస్ ఉంటాయని ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా? ఒక ఎంపీని అరెస్టు చేయాలంటే గౌరవ స్పీకర్ అనుమతి తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం ఏపీ పోలీసులకు లేకున్నా… మన రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎట్లాంటి వారెంట్ లేకుండా ఏవిధంగా ఆ పోలీసులకు ఏ విధంగా అప్పగించిందని ఆయన అన్నారు. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక రెండు రాష్ట్రాల సీఎంలు ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

Related posts

జూనియర్ యన్టీఆర్ యువసేన వితరణ….

Satyam NEWS

చిరాగ్, పారస్‌లకు వేర్వేరు ఎన్నికల గుర్తులు

Sub Editor

ఎవరు అడ్డుపడ్డా అడ్డంకులు దాటి…..

Satyam NEWS

Leave a Comment