27.7 C
Hyderabad
March 29, 2024 03: 08 AM
Slider ప్రత్యేకం

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నీలి మీడియా వక్ర భాష్యం

#raghurama

గతంలో తెలుగుదేశం పార్టీలో తలెత్తిన  సంక్షోభం లాంటిది… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తలెత్తకుండా చూసుకోవాలని  ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి  నరసాపురం ఎంపీ, ఆ పార్టీ నాయకుడు  రఘురామకృష్ణం రాజు హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మంచివారైనప్పటికీ, 1995లో  టీడీపీలో,  ఆ పార్టీ ప్రభుత్వంలో లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువై, ఎమ్మెల్యేలను అవమానించి,  అవహేళన చేసినట్టు ప్రవర్తించడం వల్ల సంక్షోభం తలెత్తింది.

పార్టీ పరిరక్షణ కోసం, ఆ పార్టీ శాసనసభ్యులు, నాయకులు చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు. ఆ విషయాన్ని ఇటీవల ఆహా ఓటిటి ఛానెల్ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన కార్యక్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు చెప్పారని రఘురామకృష్ణం రాజు గుర్తు చేశారు. సోమవారం నాడు  రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ  సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక వర్గం ఎమ్మెల్యే లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మీపార్వతిగా సంబోధిస్తుంటే, మరొక వర్గం ఎమ్మెల్యే లు మగ లక్ష్మీపార్వతి అని అంటున్నారన్నారు.

పరిస్థితి చేయి దాటకముందే, మగ లక్ష్మీపార్వతిని పక్కన పెట్టకపోతే నలుగురు కాస్త 40 మంది అయి, ఇంకా ఎక్కువమందిలో అసంతృప్తి పెరిగి అసెంబ్లీలో ఏదైనా ప్రతిపాదన పెడితే పరిస్థితి దారుణంగా ఉండవచ్చునని హెచ్చరించారు. ఇప్పటికీ మెజారిటీ మంది శాసనసభ్యులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రేమిస్తున్నారు. ఆయన తక్షణమే అపరిచితుడు క్యారెక్టర్ వీడి, రామాచారి క్యారెక్టర్ లోకి రావాలి. రామాచారిగా  ఒకే ఒక పాత్ర పోషించాలని సూచించారు. ఎమ్మెల్యేలంతా ఒకప్పటి సాక్షి దినపత్రిక ఉద్యోగి అయినా సజ్జల రామకృష్ణారెడ్డికి రిపోర్టు చేయాలనడం సరికాదు.

ఉద్యోగులు తమ సమస్యలైనా, ఎమ్మెల్యే లైన, మంత్రులనైనా వారికి విలువ ఇవ్వకుండా  సజ్జలనే కలవాలని జగన్మోహన్ రెడ్డి సూచించడం కరెక్ట్ కాదు. రాజకీయ పార్టీ అంటే మీ అబ్బా బాబు సొత్తు కాదు. పార్టీ సభ్యులందరికీ అధినేత జవాబుదారీగా ఉండాలి. తాను ఈ పార్టీ సభ్యుడనే. పార్టీ అధ్యక్షుడితో పాటు, సజ్జల కూడా  నాకు జవాబు దారే. నేను ఇష్టం ఉన్నట్టు పార్టీని నడుపుతాను అంటే కుదరదు. మీ వ్యక్తిగత జీవితంలో మాత్రమే ఇష్టం  వచ్చినట్లు ఉంటానంటే చెల్లుతుంది. పార్టీ నిర్వాహణ విధి, విధానాలు ఏమిటో  ఎన్నికల సంఘం పొందుపరిచిన నియమావళిని ఒక్కసారి చదువుకొండని రఘురామకృష్ణం రాజు హితవు పలికారు.

నలుగురితో ప్రేమగా ఉంటే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  గతంలో మాదిరిగానే రోడ్లపై తిరుగుతూ అందరి నుదుళ్లపై ముద్దు పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలో అటెండెన్స్ తీసుకోవడం మహాదారుణం. దెందులూరు బహిరంగ సభలో  అటెండెన్స్ తీసుకోగానే, బలవంతంగా తీసుకువచ్చిన ప్రజలంతా  తిరుగు ప్రయాణం కట్టడంతో  సభలో ఖాళీ కుర్చీలే దర్శనం ఇచ్చాయి. దెందులూరు బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగంలో మార్పు కనిపించింది. 

దత్త పుత్రుడు, దుష్ట చతుష్టయం అన్న వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వినిపించలేదు. బహిరంగ సభలకు ప్రజలను భయపెట్టి తీసుకువస్తే, ఎన్నికల్లో ఒక్కరు కూడా ఓటు వేయరంటూ రఘురామకృష్ణం రాజు హెచ్చరించారు. దెందులూరు బహిరంగ సభకు ఒక్కరోజు ముందు, ఆ గ్రామానికి ఇతర గ్రామాలకు చెందిన వారిని అడుగుపెట్టనివ్వలేదు. కేవలం ముఖ్యమంత్రి  రక్షణ కోసమే, వ్యాపార సంస్థలను మూసివేసి, దెందులూరు గ్రామస్తుల ఇళ్లకు   వారి బంధువులను కూడా  రాకుండా అడ్డుకోవడం విడ్డూరం .

రోడ్డు కిరువైపులా వృక్షాలు ఉండవద్దు.. సభకు హాజరయ్యే వారు  ఎర్ర చొక్కాలను వేసుకు రావద్దు, యువతులు నల్ల చున్నీలు ధరించవద్దని ఆంక్షలు విధించడం సిగ్గుచేటు. సభలకు హాజరయ్యే ప్రజలపైనే ఎన్నో ఆంక్షలు విధించే ముఖ్యమంత్రి, వై నాట్ వన్  175 అని పేర్కొనడం హాస్యాస్పదం గా ఉంది. ప్రతిపక్ష పార్టీ నేతలపై  లేని కేసులను ఆపాదించి  అరెస్టు చేయడం, తనని లుచ్చా అన్న ఓ లుచ్చా గాడికి మంత్రి పదవి ఇచ్చి పక్కన పెట్టుకోవడం, దమ్ముంటే నియోజకవర్గానికి తనని రమ్మని అంటున్న  రాజమండ్రి కర్రోడ్ని, రాజధాని ప్రాంతానికి చెందిన మరొకడి వల్ల సాధించగలిగేది ఏమీ లేదని  స్పష్టం చేశారు.

తాను పూరించిన విప్లవ శంఖాన్ని  ఇప్పటికే ఎమ్మెల్యేలు అంది పుచ్చుకున్నారు… నలుగురు కాస్త 40 మంది కాకముందే జాగ్రత్త పడితే మంచిది. పార్టీలో ఉన్న, ఉంచుకున్న సభ్యుడిగా  ఇది నా సలహా. వింటే వినండి, పెడచెవిన పెడితే నాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మంచి మాటలు చెప్పినందుకు సస్పెన్షన్ చేస్తానంటే చేసుకోండి. పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తే ఒక్క క్షణం బాధపడతాను.

ఇక అప్పుడు పార్టీ మంచి గురించి చెప్పాల్సిన అవసరం తనకు ఉండదు. ముఖ్యమంత్రి మారితే మారారని చెబుతాను. మారకపోతే మారలేదంటాను. పార్టీ నుంచి  తనని సస్పెండ్ చేయమని కోరడం లేదు. మీరు చేస్తారని అనుకోవడం లేదు. పార్టీ మంచి కోసమే ఇదంతా చెబుతున్నాను. ఒకవేళ మీకు చెడు గా అనిపిస్తే ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని రఘురామకృష్ణం రాజు సూచించారు.

ఆనం మాట్లాడింది అందరికీ అర్ధమైంది

సిబిఐ, ఈడీ కేసుల నుంచి, కుటుంబ సభ్యులను హతమార్చిన కేసు నుంచి బయటపడడానికి తాను రాజకీయాల్లోకి రాలేదు. ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని సీనియర్ శాసనసభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు… ఎవరిని ఉద్దేశించి చేశారో అందరికీ అర్థమైందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు . 1985 నుంచి శాసన సభ్యుడైన ఆనం రామనారాయణ రెడ్డి 10 నుంచి 15 సంవత్సరాల పాటు  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్  మంత్రి గా పదవి బాధ్యతలు నిర్వహించారు. శాసనసభ్యుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి  ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారని  ఆయన ప్రశ్నించిన తీరు సహేతుకంగానే ఉంది.

తనని ఎవరు ఓటు వేయమని అడగలేదని, అయినా తాను రహస్య పద్ధతిలో నిర్వహించిన ఓటింగ్ లో పార్టీ అభ్యర్థికే ఓటు వేసినప్పటికీ, ఓటు వేయలేదని తమకు ఆధారాలు లభించినందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామని చెప్పిన విధానం పై  ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తానని ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారన్నారు . ఆనం రామనారాయణ రెడ్డి కనుక ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే, తమ పార్టీ పెద్దలకు చివాట్లు తప్పవు. గతంలోనూ ఎన్నికల సంఘం  తమ పార్టీ పెద్దలకు చివాట్లు పెట్టింది. ఎన్నికల సంఘం నిబంధనల పట్ల ముఖ్యమంత్రికి అవగాహన ఉన్నదో లేదో తనకు తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డికి, విజయసాయి రెడ్డికి మాత్రం ఇంగిత జ్ఞానం లేదు.

గతంలోనూ పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డిని  ఎన్నుకున్నామని చెప్పి, ఎన్నికల సంఘం వివరణ కోరగానే  తూచ్ అన్నారని గుర్తు చేశారు. ఓటు వేయలేదన్న కారణంగా పార్టీ శాసనసభ్యులను  పార్టీ నుంచి ఎలా సస్పెండ్ చేస్తారని, రేపు ఎన్నికల సంఘం ప్రశ్నిస్తే… అబ్బే అదేమీ లేదు. వారు మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని మాట మార్చుతారని రఘురామకృష్ణంరాజు  తెలిపారు . పార్టీ నుంచి తనని సస్పెండ్ చేసిన విధానంపై  ఆనం రామనారాయణ రెడ్డి ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తే, తమ పార్టీ పెద్దలకు చివాట్లు, చెప్పు దెబ్బలు తప్పకపోవచ్చునని పేర్కొన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబం మేకపాటి కుటుంబం.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  స్థాపించాలనుకున్నప్పటినుంచి మేకపాటి గౌతం రెడ్డి ఆ పార్టీకి వెన్నుముకగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాలనుకున్నప్పుడు ఆయనకు మద్దతుగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ బలోపేతం కోసం తానే ఎదురు డబ్బులు ఇచ్చానని, నువ్వు ఏమైనా డబ్బులు ఇచ్చావా అంటూ జగన్మోహన్ రెడ్డిని చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారన్నారు. తాను ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  జయ మంగళం వెంకటరమణ కు ఓటు వేశానని, అందుకే ఆయన గెలిచారని పేర్కొంటున్నారన్నారు. అటువంటి వ్యక్తిని అంతర్గత నివేదికల ఆధారంగా సస్పెండ్ చేశామని చెప్పడం సిగ్గుచేటు అని రఘురామకృష్ణంరాజు మండిపడ్డారు.

అంతర్గత నివేదికల ఆధారంగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేశామన్న సకల శాఖామంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి తక్షణమే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. పార్టీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి శిఖండి లాగా సమన్వయకర్తను నియమించడం ఏమిటి?. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురు ఎటువంటి తప్పు చేయలేదు. క్రాస్ ఓటింగుకు పాల్పడినవారు ఎవరో మీరు తెలుసుకోలేరు. తెలుసుకున్న చేయగలిగిందేమీ లేదు. మహా అయితే, ఆ నలుగురి నియోజకవర్గాలలోనూ పోటీగా సమన్వయకర్తలను నియమించడం మినహా .  పార్టీ నేతలతోనే వారిపై లేని క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదులు చేయించి పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరన్నారు.

పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన ఎమ్మెల్యేలలో ఇద్దరు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి గుడిలో ప్రమాణం చేస్తామన్నారు. అయినా  వారిని అవమానించి పార్టీ నుంచి పంపించి వేస్తున్నారు.  ఇది సరియైన విధానం కాదు. దళిత శాసన సభ్యురాలు శ్రీదేవి చెప్పినట్టుగా  ఒక కుక్కను చంపడానికి పిచ్చి కుక్క అని ముద్ర వేసినట్లుగా, పార్టీ నుంచి పంపించి వేయాలనుకున్న శాసనసభ్యులపై ఓటు వేయలేదని, డబ్బులకు అమ్ముడుపోయారని అపవాదులు మోపుతూ బయటకు పంపించడం దారుణం.

జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్నటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వంటి వారిని కూడా అవమానించే రీతిలో సస్పెండ్ చేయడం హాస్యాస్పదం. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం, మేకపాటి, కోటంరెడ్డిలు సీనియర్ శాసనసభ్యులు.  వీరంతా  రెడ్డి సామాజిక వర్గంలోనే  ఉన్నత వర్గానికి చెందిన రెడ్డి కులస్తులు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంతగానో ప్రేమించే రెడ్డి సామాజిక వర్గంలో నెల్లూరు రెడ్లే  అత్యంత ధనవంతులు. కడప కర్నూలు జిల్లాలకు చెందిన రెడ్లు స్వతహాగా ధనవంతులైనప్పటికీ, నెల్లూరు రెడ్ల మాదిరిగా  ధనవంతులు కాదు.

నెల్లూరు జిల్లా కే చెందిన సుబ్బరామిరెడ్డి, మద్రాస్ లోని సవేరా హోటల్స్ రెడ్లు, కోరమండల్ కు చెందిన రెడ్డి కుటుంబం వ్యాపార రంగంలో  నిష్ణాతులు. ఆర్ధికంగా ఎంతో స్థితి మంతులైన నెల్లూరు రెడ్డి శాసనసభ్యులు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కాదనుకున్నారంటే ఆయన ఆత్మ విమర్శ చేసుకోవలసిన అవసరం ఉందని రఘురామకృష్ణం రాజు సూచించారు . హైదరాబాద్ నగరంలోనే పదిమంది ప్రముఖ వైద్యులలో ఒకరైన  శ్రీదేవి, ఆర్థికంగా ఎంతో స్థితిమంతురాలు. ఆమె 20 కోట్లకు అమ్ముడుపోయారని  సజ్జల రామకృష్ణారెడ్డి  ఆరోపణలు చేయగా,  నిరూపిస్తే 40 కోట్ల రూపాయలు ఆయనకు ఇచ్చేందుకు సిద్ధమని శ్రీదేవి భర్త  చేసిన సవాల్ ను స్వీకరించాలి.

దళిత యువతిని ఇష్టం వచ్చినట్లు అదే సామాజిక వర్గానికి చెందిన వారితో తిట్టించడం, కార్యాలయం పై దాడి చేయించడం అమానుషం. డాక్టర్ సుధాకర్, అచ్చన్న లను ఏ విధంగా అయితే ప్రభుత్వం చంపించిందో తనను అదేవిధంగా చంపిస్తుందన్న ఆందోళనను ఒక శాసన సభ్యురాలు వ్యక్తం చేయడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటు. జాతీయ ఎస్సీ కమిషన్ ను కలిసి తనకు ప్రాణహాని ఉన్నదని ఫిర్యాదు చేసి, రక్షణ పొందిన  తరువాత రాష్ట్రంలో అడుగిడతానని చెప్పడం  క్షీణిస్తున్న శాంతిభద్రతలకు నిదర్శనం.

ప్రభుత్వ హౌసింగ్ పథకం లో పెద్ద ఎత్తున స్కాం జరిగిందని  ప్రస్తుతం శ్రీదేవి పేర్కొనగా, తాను గత రెండున్నర ఏళ్లుగా ఇదే విషయాన్ని చెబుతున్నాను. రాజమండ్రిలో భూసేకరణలో భాగంగా ప్రభుత్వం నుంచి రైతుల అకౌంట్లోకి డబ్బు రాగానే, వెను, వెంటనే ఆ డబ్బులు ఎవరి అకౌంట్లోకి మారాయో పరిశీలిస్తే, హౌసింగ్ పథకం లో ఎవరు ఎంత అవినీతికి పాల్పడ్డారో తేలిపోతుంది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికే ఓటు వేశానని, శ్రీదేవి ఘంటా పథంగా చెప్పడమే కాకుండా, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి గుడిలో ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమేనన్నారు.

శాసన సభ్యురాలు శ్రీదేవి ఉండగానే, క్రిస్టియన్ మిషనరీలు నిర్వహించే కత్తెర సురేష్ అనే వ్యక్తి పార్టీ నాయకత్వం ప్రోత్సహించి, చివరకు ఆమెను పొమ్మన లేక పొగ పెట్టారని రఘురామకృష్ణం రాజు విమర్శించారు. పార్టీ శాసనసభ్యులను అవమానించే విధంగా మాట్లాడడమే కాకుండా, నేరారోపణ చేయడం సిగ్గుమాలిన రాజకీయం. పార్టీలో  తాను ప్రారంభించిన  విప్లవశంఖం… నలుగురికి చేరింది.

40 మంది కాకముందే పార్టీ నాయకత్వం కళ్ళు తెరవాలి. పార్టీ శాసనసభ్యులకు విలువ ఇవ్వాలి. సజ్జల వల్లే తమకు  ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ శాసనసభ్యులు చెబుతున్నారు. అసలు వాడు సరైన వాడు అయితే, సజ్జల ఏమి చేయగలడు. పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, పార్టీని ఇంతగా సజ్జల  డ్యామేజ్ చేస్తున్నారంటే  అసలు వాడికి  ఏమైనా బలహీనత ఉండి ఉండవచ్చునని రఘురామకృష్ణం రాజు  అన్నారు.

Related posts

షర్మిల పై చెప్పుల దాడిలో మంత్రి జగదీష్ రెడ్డి హస్తం? (వీడియో)

Satyam NEWS

కనక దుర్గమ్మ దసరా ఉత్సవాలపై ఆంక్షలు

Satyam NEWS

వరదల్లో కొట్టుకెళ్తున్న వ్యక్తి ప్రాణాలు కాపాడిన సైబరాబాద్ పోలీసులు

Satyam NEWS

Leave a Comment